Breaking News

నా కూతురికి అన్యాయం చేశా.. క్షమించమన్న విష్ణు తండ్రి

Published on Thu, 11/14/2024 - 16:05

ఫ్యామిలీ వీక్‌ అంటే చాలు హౌస్‌మేట్స్‌ ముఖం కళకళలాడుతుంది. ఇప్పటికే హౌస్‌లోకి నబీల్‌, యష్మి, నిఖిల్‌, అవినాష్‌, రోహిణి కుటుంబసభ్యులు అడుగుపెట్టారు. తాజాగా విష్ణుప్రియ తండ్రి ఇంట్లోకి వచ్చాడు. అతడిని చూడగానే విష్ణు సంతోషంతో ఎగిరిగంతేసింది.

అందరిముందు చెప్పొద్దు నాన్న
నువ్వు ఇంకా బాగా ఆడాలిరా అని పెద్దాయన చెప్పడంతో విష్ణు.. ఇవన్నీ అందరిముందు చెప్పొద్దు నాన్న, మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం అంది. అలా వీరిద్దరూ ఒంటరిగా కూర్చుని మాట్లాడుకున్నారు. పృథ్వీని పట్టుకుని వేలాడటం వల్ల కూడా బ్యాడ్‌ అవుతున్నావని చెప్పాడు. నువ్వు కొద్దిగా అటు వైపు ఎక్కువగా ఉండటం వల్ల నీ అభిమానులే నిన్ను విమర్శిస్తున్నారన్నాడు.  

ఆ ఫీలింగ్‌ ఎందుకు దాచేయాలి?
అందుకు విష్ణు.. నాకు అలాంటి భావన వచ్చినప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలని నిష్కల్మషంగా అడిగింది. అందుకాయన జనాలకు మనం నచ్చాలని సర్దిచెప్పాడు. ఇక చిన్నప్పటినుంచి కూతురికి దూరంగా ఉన్న సంగతులను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. కొన్ని సమస్యల వల్ల చాలారోజులు విష్ణు దగ్గరకు వెళ్లలేకపోయాను. 

అన్యాయం చేశా..
తనకు దూరంగా ఉంటున్నానని చాలా బాధపడ్డాను. నేను వాళ్లకు అన్యాయం చేశాను.. అందుకు ఇక్కడ కూడా సారీ చెప్తున్నాను అన్నాడు. ఇంతలో తేజ పెళ్లి ప్రస్తావన తేగా.. తప్పకుండా దగ్గరుండి వివాహం జరిపిస్తానన్నాడు. తనకు నచ్చినవాళ్లు దొరకాలిగా అన్నాడు. దీంతో రోహిణి.. అబ్బాయిని కూడా మీ అమ్మాయే చూసుకుంటుందిలెండి అనేసింది. అందుకాయన.. హౌస్‌లో జరిగేవన్నీ సరదా కోసం మాత్రమే! అని తెలిపాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)