Breaking News

అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్‌ వల్ల బ్యాడ్‌ అయ్యానన్న యష్మి

Published on Mon, 11/18/2024 - 16:33

ఈసారి నామినేషన్స్‌ ప్రక్రియను బిగ్‌బాస్‌ వెరైటీగా ప్లాన్‌ చేశాడు. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్‌ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్‌ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్‌ అంటూ ప్రేరణను నామినేట్‌ చేసింది.

సిల్లీ రీజన్స్‌తో నామినేషన్‌
ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్‌ చేశావ్‌? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్‌ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్‌ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్‌ ట్రాక్‌ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్‌ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్‌ అందుకున్నాడు. 

నిఖిల్‌ జోలికే వెళ్లేదాన్ని కాదు
తన ఫీలింగ్‌ చెప్పగానే అక్కడే కట్‌ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్‌ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్‌ అయ్యానంది. అలా సోనియా నిఖిల్‌ నెత్తిపై బాటిల్‌ పగలగొట్టి నామినేట్‌ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్‌ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేవరకు  ఆగాల్సిందే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)