Breaking News

ఆదిత్య పిచ్చిపని.. బిగ్‌బాస్‌ వార్నింగ్‌.. నిజం ఒప్పుకున్న విష్ణు

Published on Mon, 09/30/2024 - 23:45

ఈ రోజు నామినేషన్స్‌లో అంత ఫైర్‌ ఏం కనిపించలేదు. కారణాలు వెతుక్కుని మరీ ఒకరినొకరు నామినేట్‌ చేసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపైనే పడ్డారు. యష్మి.. నిఖిల్‌ టీమ్‌కు షిఫ్ట్‌ అయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్‌ 30) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

అలా వెళ్లి ఇలా వచ్చేశాడు
ఈ సీజన్‌లో జైల్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతడిని బయటకు పంపించి నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్‌ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటలో వేయాలన్నాడు. మొదటగా నాగమణికంఠ మాట్లాడుతూ.. మొదటి వీక్‌లో ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్‌ చేశాడు. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోను మంటల్లో వేశాడు.

నామినేషన్స్‌
తర్వాత నైనిక..నబీల్‌, విష్ణుప్రియను; సీత.. మణికంఠ, విష్ణుప్రియను; నబీల్‌.. నైనిక, విష్ణుప్రియను నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా విష్ణు.. నేను అనుకున్నంత ఈజీగా ఈ జర్నీ లేదు. నేను ప్రతిరోజు బెస్ట్‌ ఇవ్వలేను.. కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది. ఆదిత్య ఓం.. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోను అగ్నిలో వేశాడు. ఆచితూచి మాట్లాడంటూ విష్ణును నామినేట్‌ చేశాడు.

నీకే నోటిదురుసు
నిఖిల్‌ వంతురాగా.. నువ్వు చేసే కామెడీ ఎదుటివారిని బాధపెట్టేలా ఉండకూడదు అని విష్ణును నామినేట్‌ చేశాడు. అప్పుడు విష్ణు.. నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటిది నువ్వు వచ్చి చెప్తున్నావా? అని సెటైర్లు వేయడంతో లేడీ గ్యాంగ్‌ ఫక్కుమని నవ్వింది. సింపతీ గేమ్‌ ఆడుతున్నావంటూ నాగమణిని నామినేట్‌ చేశాడు. తర్వాత ప్రేరణ.. త్యాగం చేయడం తప్పు అంటూ మణి ఫోటోను మంటల్లో వేసింది. మీలో కాన్ఫిడెన్స్‌ సన్నగిల్లుతోందంటూ ఆదిత్యను నామినేట్‌ చేసింది. 

ఆవేశపడ్డ ఆదిత్య
ఆమె మాటలతో ఆవేశపడ్డ ఆదిత్య.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటోను బయటకుతీస్తూ ఇదీ నా కాన్ఫిడెన్స్‌ అన్నాడు. దీంతో బిగ్‌బాస్‌.. మంటల్లో చేయి పెట్టడం ఆటలా? అని క్లాస్‌ పీకడంతో ఆదిత్య క్షమించమని కోరాడు. తర్వాత విష్ణుప్రియ.. నీ పర్ఫామెన్స్‌ ఇంకా మెరుగవ్వాలంటూ నైనికను నామినేట్‌ చేసింది. సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ నబీల్‌ ఫోటోను మంటల్లో వేసింది. 

మాట మార్చావ్‌..
యష్మి.. మణికంఠను నామినేట్‌ చేస్తూ నువ్వు ఎలా సేవ్‌ అవుతున్నావో అర్థం కావట్లేదు... నువ్వు నా ఫ్రెండ్‌ కానందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో మణి, యష్మి.. చాలాసేపు వాదులాడుకున్నారు. అనంతరం యష్మి.. మీలో క్లారిటీ మిస్‌ అయినట్లు అనిపిస్తోందని ఆదిత్య ఫోటోను మంటల్లో వేసింది. పృథ్వీ.. నైనికను నామినేట్‌ చేశాడు. నాలుగు గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరిముందు త్యాగం చేయలేదని మాట మార్చావంటూ మణికంఠను నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కాసేపు గొడవపడ్డారు. 

నామినేషన్స్‌లో ఎవరంటే?
చివర్లో హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ సూపర్‌ పవర్‌ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్స్‌లో ఒకరిని నామినేట్‌ చేయొచ్చన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతను సేవ్‌ చేయడానికే మొగ్గు చూపడంతో నిఖిల్‌ నామినేషన్‌లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్‌, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబీల్‌ నామినేషన్‌లో ఉన్నారు.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)