Breaking News

ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా

Published on Mon, 09/23/2024 - 23:02

చీఫ్‌ పోస్ట్‌ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్‌ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట.. నామినేషన్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్‌ 23) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

ఆదిత్యపై సోనియా సెటైర్లు
ఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలకు ఫోమ్‌ కొట్టి నామినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం.. పృథ్వీని నామినేట్‌ చేశాడు. మైక్‌ పక్కనపెట్టి గుసగుసలు పెడుతున్నావ్‌, నీ ఫ్రెండ్‌ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్‌ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్‌ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావ్‌ కానీ ఫెయిలయ్యావ్‌ అని వెటకారంగా మాట్లాడింది.

గొంతు పెంచితే తప్పా?
నైనిక.. నేను సేఫ్‌ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్‌ చేసింది. టాస్క్‌ సరిగా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్‌ స్ప్రే చేసింది. నబీల్‌ వంతురాగా.. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్‌, పృథ్వీ నామీదకు దూసుకురావడమేంటోనని సోనియాను నామినేట్‌ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్‌ సోనియా బాడీగార్డుల్లా నబీల్‌పై ఎగబడటం గమనార్హం. 

వెన్నుపోటు..
తర్వాత అతడు పృథ్వీని నామినేట్‌ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్‌ సంచాలక్‌ అంటూ పదేపదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ.. నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్‌ చేసింది. నీ గేమ్‌ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్‌ చేసింది. 

మనిషిగా కూడా ఫెయిల్‌ 
సోనియా వంతురాగా.. సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్‌ అని నబీల్‌ను నామినేట్‌ చేసింది. అవునా, నిన్ను నామినేట్‌ చేసినందుకు నేను తప్పు, ఫేక్‌ కదా అని కౌంటరిచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్‌ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లులేవు. ఈ వారం వెళ్తానని మీరు ఫిక్సయ్యారు కాబట్టి ప్లీజ్‌, వెళ్లిపోండి అని నామినేట్‌ చేసింది.

బొమ్మరిల్లు సిద్దు సీన్‌ రిపీట్‌
నాగమణికంఠ వంతురాగా.. నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్‌ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌లా ఎక్కువ గైడ్‌ చేసేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్దార్థ్‌లా క్లాసు పీకాడు. విష్ణుప్రియ.. నిన్నొకరు(పృథ్వీ) బూతు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్‌ చేసింది. అతడు తిట్టింది నన్నుకాదని నాకు తెలుసు.. నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుటున్నావని అసలు విషయం బయటపెట్టింది. 

నేను వీక్‌ కాదు: మణి
పృథ్వీ.. నబీల్‌, నాగమణికంఠను; సీత.. ప్రేరణ, మణికంఠను నామినేట్‌ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్‌ అంటూ మణిని నామినేట్‌ చేసింది. నేను వీక్‌ అయితే ఎప్పుడో గేట్లు తీయండని చెప్పి బయటకు వెళ్లిపోయేవాడిని అని వాదించాడు. సోనియాను నామినేట్‌ చేస్తూ.. నిఖిల్‌, పృథ్విని ఆయుధంలా వాడుకుంటున్నావ్‌, ఆ ఇద్దరి సపోర్ట్‌ లేకుండా గేమ్‌ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. 

ఎవర్ని కొడతానో తెలీదు
అందుకు సోనియా.. నేను అందరికంటే అగ్రెసివ్‌.. నేను గ్రౌండ్‌లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్‌ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌, నైనిక నామినేట్‌ అ‍య్యారు. అయితే నిఖిల్‌ చీఫ్‌ అయినందున అతడికి ఒకర్ని సేవ్‌ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్‌ చేశాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)