బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్‌ స్టోరీ చెప్పిన సీత

Published on Sun, 09/15/2024 - 23:33

బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్‌ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్‌ బాషాను అన్యాయంగా ఎలిమినేట్‌ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్‌ 15) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

నిఖిల్‌కు నా గైడెన్స్‌ అవసరం: సోనియా
సోనియా పాటతో ఫండే ఎపిసోడ్‌ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్‌. నిఖిల్‌, అభయ్‌ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్‌ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్‌ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్‌ పర్ఫామర్‌ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్‌ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. 

విష్ణుప్రియతో గొడవలకు ఫుల్‌స్టాప్‌!
అభయ్‌ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్‌, మణికంఠ ఉన్నారు. అభయ్‌ టీమ్‌కు కాంతార, నిఖిల్‌ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్‌ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్‌ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్‌ చేసుకుంది. నాగ్‌ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్‌ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్‌ స్టోరీ చెప్తే వారికి ఎక్స్‌ట్రా పాయింట్‌ ఇస్తానన్నాడు నాగ్‌. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్‌ స్టోరీని మొదలుపెట్టింది. 

ఆరు నెలల్లో  14 కిలోలు తగ్గా
నా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్‌ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్‌ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్‌ గెలవడంతో తన శక్తి టీమ్‌ విజేతగా నిలిచింది.

హౌస్‌మేట్స్‌ చేతిలో ఎలిమినేషన్‌
మీకు గిఫ్ట్‌ హ్యాంపర్‌ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్‌ చేయాలా? అని నాగ్‌ రెండు ఆఫర్స్‌ ముందు పెట్టాడు. టీమ్‌ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000​కు చేరింది. తర్వాత సీత సేవ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్‌లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్‌ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్‌ అవ్వాలనేది హౌస్‌మేట్స్‌ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. 

సీత మాత్రమే బాషాకు సపోర్ట్‌
ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్‌ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్‌ చేసింది. ఫైనల్‌గా శేఖర్‌ ఎలిమినేట్‌ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్‌ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్‌ చేస్తారు అని తెలిపాడు.

ఎవరు ఫేక్‌? ఎవరు రియల్‌?
స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్‌, ఎవరు రియల్‌ అన్నది చెప్పమని గేమ్‌ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్‌, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్‌ పర్సన్‌ లిస్టులో చేర్చాడు. 

సోనియాకు రెండు ముఖాలు
ఫేక్‌ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్‌లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్‌ ఫేస్‌ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్‌ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్‌ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్‌ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్‌ హౌస్‌ కోల్పోయింది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)