Breaking News

ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్‌మనీని ఖాతరు చేయని నబీల్‌

Published on Mon, 10/21/2024 - 22:47

నామినేషన్స్‌.. ఈసారి అన్నీ రివేంజ్‌ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్‌. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్‌ 21) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

నామినేషన్స్‌ షురూ
ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. నామినేషన్‌ షీల్డ్‌ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్‌ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్‌ గౌతమ్‌.. ఈ నామినేషన్‌ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.

పృథ్వీ మీద ప్రేమతో.. 
పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్‌ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్‌ చేసింది విష్ణు. గేమ్‌ స్లో అయిపోతుందంటూ, లైటర్‌ కోసం పాయింట్‌ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్‌ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి పాయింట్‌ ఇచ్చేశావ్‌గా అని నిఖిల్‌ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్‌ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్‌ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్‌, గేమ్‌లో అగ్రెసివ్‌ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్‌ చేసింది. 

బాడీ షేమింగ్‌
పృథ్వీ.. పోయినవారం కిల్లర్‌ గర్ల్‌గా తనను నామినేట్‌ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్‌, ఆటలో జీరో.. నీకు రన్నింగ్‌ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్‌ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్‌ చేయకు.. తొక్కలో నామినేషన్స్‌ చేయకు అని ఇచ్చిపడేసింది.

సెల్ఫిష్‌ గేమ్‌
నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్‌, నిఖిల్‌ను నామినేట్‌ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్‌ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది.‍ సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్‌ చేసింది. 

ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..
నబీల్‌.. నన్ను ఇమ్మెచ్యూర్‌ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్‌ చేశాడు. మీకు డెసిషన్‌ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్‌ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)