Breaking News

ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!

Published on Thu, 11/28/2024 - 23:02

గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్‌ట్రాక్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్‌ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్‌ 28) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

హౌస్‌లో వితికా, పునర్నవి
అవినాష్‌ టికెట్‌ టు ఫినాలే కంటెండర్‌ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్‌ ఓవర్‌ స్మార్ట్‌ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ ఆడించారు. క్రష్‌ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.

అబద్ధం చెప్పానన్న నిఖిల్‌
మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్‌.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్‌ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్‌ - నో ఫ్రెండ్స్‌, ట్రూ ఫ్రెండ్‌- నో లవ్‌.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్‌ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్‌ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్‌ కింగునని తెలిపాడు.

సింపతీ కార్డు?
తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్‌ చేసింది. విష్ణు ఫ్రెండ్‌ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్‌ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్‌ కోసం నిఖిల్‌, గౌతమ్‌ను సెలక్ట్‌ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. 

పృథ్వీకి అన్యాయం
తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్‌ గేమ్‌ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్‌ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్‌ చెరో 5 డిస్కులు బాస్కెట్‌లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్‌ ఇచ్చారు.

ప్రేరణకు బ్లాక్‌ బ్యాడ్జ్‌
ఈ గ్యాప్‌లో అవినాష్‌, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్‌ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్‌ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్‌ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్‌.. టికెట్‌ టు ఫినాలే రేస్‌ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

కోపం, బాధ
ర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్‌ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్‌, పృథ్వీ, గౌతమ్‌ గేమ్‌ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్‌ గెలవగా గౌతమ్‌ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్‌ బ్యాడ్జ్‌ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్‌ అవుతోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)