Breaking News

నిఖిల్‌కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్‌ జోలికి మాత్రం..!

Published on Wed, 11/13/2024 - 23:37

ఫ్యామిలీ వీక్‌ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్‌ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్‌ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్‌ 13) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

యష్మికి హింట్‌ ఇచ్చిన తండ్రి
తండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్‌ గేమ్‌ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. 

కూతురి తరపున సారీ
ఇన్నివారాలున్నావ్‌.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్‌ చేస్తుంటే.. నబీల్‌కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్‌లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు.

 .

కుమిలిపోతున్న తేజ
ఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్‌ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్‌మేట్స్‌కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్‌.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్‌ గ్రాఫ్‌ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. 

నిఖిల్‌ను జాగ్రత్తపడమన్న తల్లి
గ్రూప్‌ గేమ్‌ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్‌గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్‌)తో ఎక్కువగా ఫైట్‌, డిఫెన్స్‌కు వెళ్లొద్దు, నామినేషన్‌ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్‌ చేస్తున్నా అని నిఖిల్‌ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్‌ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్‌ చేయు. 

ఆమెకు దూరంగా ఉండు
P (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్‌ ఆడి మటన్‌ సంపాదించింది. తమకు నాన్‌వెజ్‌ రావడంతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్‌ను హత్తుకుంది.

భార్య కోసం డ్రెస్‌ మార్చుకున్న అవినాష్‌
భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్‌ డ్రెస్‌లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్‌ మార్చుకున్నాడు. బిగ్‌బాస్‌ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్‌ పెట్టాడు. ఈ గేమ్‌ ద్వారా రూ.51,000 ప్రైజ్‌మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్‌ టైమింగ్‌ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్‌మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్‌బాస్‌ పెద్ద జే ప్లాన్‌ చేశాడు. 

బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌
యాక్షన్‌ రూమ్‌ను హార్ట్‌ షేప్‌ బెలూన్లతో నింపేసి డిన్నర్‌ డేట్‌ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్‌.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ అన్నాడు. ఇంతలో బిగ్‌బాస్‌ అవినాష్‌ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్‌ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)