Breaking News

నామినేషన్స్‌ నుంచి డైరెక్ట్‌గా టాప్‌ 5లోకి అవినాష్‌: నాగ్‌

Published on Sat, 11/30/2024 - 18:36

అవినాష్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచినప్పటి నుంచి అందరి మనసులో ఒకటే డౌట్‌.. అతడు డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టినట్లేనా? లేదంటే ఈ వారం ఎలిమినేషన్‌ గండం గట్టెక్కితేనే ఫైనల్‌లో ఉంటాడా? అని! ఈ అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. 

అవినాష్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్‌
తాజా ప్రోమోలో నాగ్‌ మాట్లాడుతూ.. 'టికెట్‌ టు ఫినాలే గెలిచిన అవినాష్‌.. ఈ వారం నామినేషన్స్‌ నుంచి బయటకు వచ్చి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లాడు. ఈ సీజన్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అవినాష్‌' అని ప్రకటించాడు. అలాగే డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని కూడా హింటిచ్చాడు. హౌస్‌లో కొందరికి గోల్డ్‌ టికెట్‌, మరికొందరికి బ్లాక్‌ టికెట్‌ ఇచ్చాడు. ఫస్ట్‌ బ్లాక్‌ టికెట్‌ ఎవరికి వస్తుందో గెస్‌ చేయమని నిఖిల్‌ను అడిగితే.. తనకు తెలియదని అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే సేఫ్‌ గేమ్‌ ఆడొద్దనేదంటూ నాగ్‌.. నిఖిల్‌కు చురకలంటించాడు.

వీడియోతో దొరికిపోయిన ప్రేరణ
ఇదే ప్రశ్న రోహిణిని అడగ్గా.. పృథ్వీకి బ్లాక్‌ టికెట్‌ ఇవ్వాలంది. నేను గేమ్స్‌ ఆడలేను, అతడు మాత్రమే ఆడగలను అని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ చూపించేవాడని కారణం చెప్పింది. గౌతమ్‌ వంతురాగా.. బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఇచ్చారన్న కోపంతో ప్రేరణ.. గెస్టులతో కూడా సరిగా ప్రవర్తించలేదన్నాడు. ఈ క్రమంలో నువ్వు ఫెయిర్‌గా ఆడావా? అని నాగ్.. ప్రేరణను ప్రశ్నించాడు. ఆమె అవునని తలూపడంతో ఫౌల్‌ గేమ్‌ ఆడిన వీడియో ప్లే చేశాడు.

విష్ణుప్రియను తప్పుపట్టిన ఆడియన్స్‌
అది నా గేమ్‌ అని ప్రేరణ అనగా.. నువ్వు  ఫెయిర్‌గా ఆడలేదన్నాడు నాగ్‌. హౌస్‌లో విన్నర్‌ ఎవరని విష్ణుప్రియను అడగ్గా ఆమె తన పేరే చెప్పింది. మరి విన్నర్‌లా ఆడుతున్నావా? అని నాగ్‌ అంటే.. నేను చూసిన సీజన్స్‌లో అన్ని ఆటలు గెలిచినవారు టైటిల్‌ కొట్టలేకపోయారు అంది. ఆమె అభిప్రాయాన్ని సెట్‌లో ఉన్న ఆడియన్స్‌ తప్పుపట్టారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)