Breaking News

గౌతమ్‌ను ఈడ్చుకెళ్లిన నిఖిల్‌.. కావాలని కొడతావంటూ కామెంట్స్‌

Published on Fri, 12/06/2024 - 16:30

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో నిఖిల్‌, గౌతమ్‌ బ్యాలెన్స్‌ తప్పుతున్నారు. మొన్న గౌతమ్‌ నోరు జారి.. తన స్థాయిని తనే తగ్గించుకోగా నేడు నిఖిల్‌ వంతు వచ్చినట్లుంది. ఎదుటివారికి గౌరవం ఇవ్వవు అని గౌతమ్‌ను తప్పుపట్టే నిఖిల్‌.. నేడు అతడిని చులకన చేసి మాట్లాడాడు. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది.

గోల్డెన్‌ టికెట్‌ అందుకున్నవారికి ఆఫర్‌
పోయినవారం గోల్డెన్‌ టికెట్‌ అందుకున్న నిఖిల్‌, గౌతమ్‌, రోహిణిలలో ఒకరికి ఓట్‌ అప్పీల్‌ చేసే ఛాన్స్‌ ఉంటుందన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా ఈ ముగ్గురికి కేక్‌ గేమ్‌ ఇచ్చాడు. ఇందులో రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరికి బిగ్‌బాస్‌ రంగు పడుద్ది అనే గేమ్‌ పెట్టాడు. ప్రత్యర్థి టీషర్ట్‌పై వీలైనంతవరకు రంగు పూయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నిఖిల్‌, గౌతమ్‌ పోటాపోటీగా ఆడారు.

నిఖిల్‌ వెకిలి మాటలు
గేమ్‌ అయ్యాక.. గౌతమ్‌ నన్ను కొట్టాడని నిఖిల్‌ అన్నాడు. రంగు పూయబోతుంటే తగిలింది.. అలా అంటే నువ్వు నన్ను కిందపడేసి ఈడ్చుకుంటూ పోయావా? లేదా? అని గౌతమ్‌ ప్రశ్నించాడు. దానికి నిఖిల్‌ సమాధానమివ్వకుండా పక్కకెళ్లి కూసో బే అని కామెంట్‌ చేశాడు. బే అని ఎవడ్ని అంటున్నవ్‌? అంటూ గౌతమ్‌ సీరియస్‌ అయ్యాడు.

కావాలని కొట్టినా కొడతావు
నీకు ఆడే విధానం లేదు, నన్ను కొట్టావని మరోసారి ఆరోపించాడు నిఖిల్‌. గేమ్‌లో ఎవడైనా కావాలని కొడతాడా? అని గౌతమ్‌ అంటుంటే కూడా ఎవరికి తెలుసు? నువ్వు కావాలని కొట్టినా కొడతావు అంటూ నిఖిల్‌ మరింత రెచ్చగొట్టాడు. ఇకపోతే ఈ గేమ్‌లో నిఖిల్‌ గెలిచిన ఓట్‌ అప్పీల్‌ ఛాన్స్‌ పొందినట్లు తెలుస్తోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)