Breaking News

Bigg Boss 8: పదోవారం గంగవ్వ సెల్ఫ్‌ ఎలిమినేట్‌

Published on Sun, 10/06/2024 - 22:06

వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్‌ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె ఐదేళ్లకే పెళ్లి చేసుకుంది. కష్టాల నీడలోనే పెరిగిన మిల్కూరి గంగవ్వ మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరికీ పరిచయమైంది. తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్‌ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది.

స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్‌ 8లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈసారి వెళ్లగొట్టేదాకా ఉండనంది. మనసు ఉండాలంటున్నా శరీరం వద్దని చెప్తుండటంతో చేసేదేం లేక మరోసారి స్వచ్ఛందంగా ఇంటినుంచి వెళ్లిపోయింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)