బిగ్ బాస్ ఐదవ వారం విశ్లేషణ...'పాత బొమ్మలతో కొత్త పోస్టర్'

Published on Mon, 10/07/2024 - 12:23

ఓ పిల్లాడు సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా నాకేదైనా కొత్త వంట చేసి పెట్టు అని తల్లిని అడిగాడు. ఇంట్లో పొద్దున వండిన ఇడ్లీలు తప్ప ఏమీ లేవు. దాంతో తల్లి ఆ ఇడ్లీలను తుంచి వేపుడు చేసి బిడ్డకు పెట్టింది. తల్లి తన కోసం కొత్త వంట చేసిందని సంబరపడిపోయి ఆనందంగా తిన్నాడు ఆ బిడ్డ. ఇక్కడ తల్లి పాత్ర బిగ్ బాస్ అయితే బిడ్డ పాత్ర ప్రేక్షకులు. ఇక ఇడ్లీలు కంటెస్టెంట్లు అని వేరేగా చెప్పకరలేదు. 

బిగ్ బాస్ 8 లిమిట్ లెస్ ఎంటర్ టైన్‌మెంట్ అని టాగ్ లైన్‌తో ఊదరగొట్టిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లు లిమిట్ లెస్ ఎంటర్ టైన్‌మెంట్ ఏమో గాని లిమిట్ లెస్ కన్ఫ్యూజన్ మాత్రం చూస్తున్న ప్రేక్షకులను గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న(లేక చేస్తున్న) ఎంటర్ టైన్‌మెంట్ సరిపోలేదో (సరిరాదో) ఏమో కాని ఉన్నపళాన వారం వ్యవధిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి మరో 8 పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపాడు బిగ్ బాస్. ఆదిత్య ఓం, నైనిక ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో వున్నారు. 

ఒక ఎలిమినేషన్ (ఆదిత్యఓం) హౌస్ మొత్తం కలిసి తీసుకున్నదైతే మరో ఎలిమినేషన్ మాత్రం (నైనిక) బిగ్ బాస్ చేసింది. ఇక వైల్డ్ కార్డ్ పేరిట ఓ 8 పాత కంటెస్టెంట్లను రంగంలోకి దింపిన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక లో మాత్రం పెద్దగా ఆసక్తి కనబరిచినట్టుగా లేదు. కంటెస్టెంట్లు దొరక్కో లేక పాత కంటెస్టెంట్ల అందుబాటులో వున్నందుకో కాని పెద్దగా ఉత్సాహాన్నిచ్చే కంటెస్టెంట్లు లేరనే అనిపిస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఈ పాత కంటెస్టెంట్లైన కొత్త వైల్డ్ కార్డ్స్ ఉన్న కంటెస్టెంట్లతో ఎలా ఆడతారో ఈ పాత కొత్త ఆటను ఆస్వాదించే ప్రేక్షకులకు తెలియాలి. ఆఖరుగా ఒక్క మాట 'కొత్తొక వింత పాతొక రోత' అన్న నానుడి సదరు బిగ్ బాస్ కు తెలిసో లేదో...!!

-ఇంటూరి హరికృష్ణ

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)