Breaking News

నిఖిల్‌ను గెలిపించేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ రెడీ?

Published on Sun, 12/08/2024 - 17:37

బిగ్‌బాస్‌ విన్నర్‌ను ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే నిర్ణయిస్తారా? అంటే సమాధానం చెప్పడానికి కొంత తడబడాల్సిందే! ఎందుకంటే బిగ్‌బాస్‌ అంటేనే స్క్రిప్టెడ్‌ షో అన్న పేరుంది. గొడవలు, కలిసిపోవడాలు, లవ్‌ ట్రాక్స్‌.. ఇలా అన్నీ కూడా ఒక ప్లాన్‌ ప్రకారమే జరుగుతాయన్న అపవాదు ఎప్పుడూ ఉండనే ఉంది. 

ఎవరికి ట్రోఫీ?
ఇది నిజమేనని కొందరు, వంద రోజులు అందర్నీ ఒకే ఇంట్లో పడేస్తే కొట్టుకోకుండా ఇంకేం చేస్తారని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారివి! మరి విన్నర్‌ను ప్రేక్షకులు డిసైడ్‌ చేస్తారా? లేదా మేనేజ్‌మెంట్‌ ఆల్‌రెడీ ఫిక్సయిన వ్యక్తికే ట్రోఫీ ఇచ్చేస్తారా?.. నటుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అఖిల్‌ సార్థక్‌ దీనికి సమాధానం చెప్పాడు.

గౌతమ్‌ గెలిచే అవకాశం లేదట
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్‌ మాట్లాడుతూ.. ఇది పెద్ద వివాదం అవుతుందేమో! జెన్యున్‌గా చెప్పాలంటే నాకైతే గౌతమ్‌ ఈ షో గెలిస్తే బాగుంటుందనిపిస్తోంది. అయితే బిగ్‌బాస్‌ టీమ్‌లో కొందరు నాకు తెలుసు.. వాళ్లు చెప్పినదాని ప్రకారం గౌతమ్‌ గెలిచే అవకాశం లేదని టాక్‌. నిఖిల్‌ గెలుస్తాడని చెప్తున్నారు. కష్టపడిన వాడే గెలుస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే గత సీజన్‌కు, ఇప్పటికి గౌతమ్‌ చాలా మెచ్యూరిటీ వచ్చింది అని అఖిల్‌ పేర్కొన్నాడు.

ఈ మాత్రం దానికి ఓట్లు ఎందుకు?
ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాయి. విజేత ఎవరనేది బిగ్‌బాస్‌ యాజమాన్యం ముందుగానే డిసైడ్‌ చేస్తే ఇంక మమ్మల్ని ఎందుకు ఓట్లు వేయమని అడగడం? అని బిగ్‌బాస్‌ ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)