Breaking News

మూడు వారాలకే బ్యాగు సర్దిన అభయ్‌.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Published on Sun, 09/22/2024 - 22:09

ఆటతో లేదా మాటతో మెప్పించాలి. అప్పుడే బిగ్‌బాస్‌ షోలో రాణించగలరు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్‌ కోల్పోయినా హౌస్‌ నుంచి బయటకు రావడం ఖాయం! అభయ్‌ నవీన్‌ రెండింటి మీదా పట్టు కోల్పోయాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు. ఏదో అదృష్టం కలిసొచ్చి అభయ్‌ చీఫ్‌ అయ్యాడంతే! 

అచ్చిరాని చీఫ్‌ పోస్ట్‌
కంటెస్టెంట్లు తనను నమ్మి చీఫ్‌ పదవి కట్టబెట్టారు. ఏ ముహూర్తాన చీఫ్‌ అయ్యాడో కానీ తనలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రస్ఫుటంగా కనిపించాయి. పైగా సెల్ఫ్‌ నామినేట్‌ అవడంతో అతడి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఇట్టే బయటపడింది. గుడ్ల టాస్క్‌లో తన టీమ్‌ గెలుపు కోసం వెంపర్లాడుతుంటే చీఫ్‌ పోస్టులో ఉన్న అభయ్‌ మాత్రం పిచ్చ లైట్‌ తీసుకున్నాడు. అంతేనా, టీమ్‌ సభ్యులను కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.

ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదే
పైగా తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్‌ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్‌ మీద తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్‌.. బయాస​్‌డ్‌ అంటూ నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్‌ మీదకు తోసేశాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు, తనను బయటకు పంపించడమే బెస్ట్‌ అనుకున్నారు.

నాగార్జున దయ చూపినా..
ఏదో అద్భుతంగా ఆడి బిగ్‌బాస్‌ను నిలదీసుంటే మెచ్చుకునేవారేమో కానీ, ఇలా చేతగానివాడిలా ఓ మూలన కూర్చుని సెటైర్లు వేయడం ఎవ్వరికీ మింగుడుపడలేదు, అందుకే నాగార్జున రెడ్‌ కార్డు చూపించినప్పటికీ దయ తలిచి హౌస్‌లో ఉండనిచ్చినా ప్రేక్షకులు అందుకు ఒప్పుకోలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇక ఈ మూడువారాలకుగానూ దాదాపు రూ.6 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)