Breaking News

నామినేషన్స్‌లో రైతుబిడ్డ ఓవరాక్షన్‌.. ఇచ్చిపడేసిన గౌతమ్‌!

Published on Tue, 10/24/2023 - 15:21

నామినేషన్స్‌ అంటేనే కంటెస్టెంట్లు హడలెత్తిపోతుంటారు. కొందరేమో దొరికిందే ఛాన్సని అవతలి వారి మీదున్న కోపాన్ని నామినేషన్స్‌ ద్వారా తీర్చుకుంటారు. మరికొందరేమో మండే రోజే తమలోని కళల్ని బయటకు తీస్తారు. రైతుబిడ్డగా జనాల్లో బీభత్సమైన సింపతీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్‌ రెండో కేటగిరీకి చెందుతాడు. సాధారణ రోజుల్లో తన ధ్యాసంతా గేమ్‌ మీదే పెడతాడు.. బాగా ఆడతాడు కూడా! కానీ, పొరపాటున తనను ఆటలో నుంచి తీసేసినా.. ఎవరైనా నామినేట్‌ చేసినా అస్సలు భరించలేడు. విశ్వరూపం చూపిస్తాడు.

ఊరోడు అన్నావ్‌.. మళ్లీ అనలేదని మాట మార్చావ్‌
నిన్నటి నామినేషన్స్‌లోనూ అదే జరిగింది. గౌతమ్‌ తనను నామినేట్‌ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎప్పటిలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. సందీప్‌ మాస్టర్‌ను ఊరోడు అన్నావు.. తర్వాతేమో అనలేదని మాట మార్చావు.. అలా రెండు మాటలు మాట్లాడటం నచ్చలేదంటూ ప్రశాంత్‌ ఫోటోను మంటల్లో వేయబోయాడు గౌతమ్‌. అయితే ప్రశాంత్‌ మాత్రం.. నేను మాట్లాడాక నా ఫోటోను మంటల్లో వేయు. కాసేపైనా నా ఫోటో చూసుకుంటూ మాట్లాడతా.. గట్లే ఉంటదా అన్న.. ఫోటో చూపెట్టు.. ఎంత బాగుంది.. అంటూ రాగాలు తీశాడు. గౌతమ్‌ చెప్పిన పాయింట్‌ ఎలాగూ కరెక్టే కాబట్టి సరిగా ఆన్సర్‌ ఇవ్వలేక.. అది అయిపోయిన విషయం.. సందీప్‌కు సారీ చెప్పేశానంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌..
అంతేకాదు, తన మేనరిజాన్ని చూపిస్తూ అవతలివారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. ఈ యాక్టింగ్‌ చూసి నవ్వుకున్న గౌతమ్‌.. నువ్వెప్పుడూ నన్ను నామినేట్‌ చేయలేదా? అప్పుడు నేను ఇలాగే ప్రవర్తించానా? అని ప్రశ్నించగా ప్రశాంత్‌ దగ్గరి నుంచి సమాధానమే కరువైంది. పైగా అలాగే ఓవరాక్షన్‌ చేస్తుండటంతో ఎందుకురా? మంట ఆరదు, నీతి చావదు అన్న మాటలెందుకు? నీ నీతి, నిజాయితీ గురించి నేనేమీ మాట్లాడట్లేదు.. నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మరి నాగార్జున సార్‌ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎందుకేడ్చావు? అదంతా యాక్టింగా? అని వరుస ప్రశ్నలతో ప్రశాంత్‌కు ఇచ్చిపడేశాడు.

వెనక్కు తగ్గని డాక్టర్‌ బాబు
అయినా ప్రశాంత్‌ ఓవరాక్టింగ్‌ చేస్తూనే ఉండటంతో నేనేమీ ఆడిషన్‌ చేయట్లేదు అని కౌంటరిచ్చాడు డాక్టర్‌ బాబు. తర్వాత హౌస్‌లో అందికంటే మీరు వీక్‌గా ఉన్నారనిపిస్తోందంటూ భోలె షావళిని నామినేట్‌ చేశాడు గౌతమ్‌. దీనికతడు నువ్వు డాక్టర్‌ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు.. నేను వీక్‌ అని చెప్పకు అంటూ వెక్కిరిస్తూ పాటలు పాడాడు. అయినా సరే డాక్టర్‌ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రైతుబిడ్డ ఇలాగే అతి చేస్తే రానున్న రోజుల్లో ఎలిమినేట్‌ అవడం ఖాయమే!

చదవండి: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. డైరెక్ట్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)