Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
ఫైమాకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్
Published on Fri, 12/09/2022 - 18:55
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో విన్నర్ ఎవరంటే ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ అనే చెప్తారు. గెలుపు గాలులు అతడివైవే వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే అతడు హౌస్‌లో ఏం మాట్లాడినా ఎవరూ పెద్దగా ఎదురుచెప్పరు, వార్నింగ్‌లు ఇచ్చినా, తిండి పెట్టకపోయినా గట్టిగా నిలదీసేవారే లేరు, ఒక్క ఫైమా తప్ప! అందరిలా ఆమె చేతులు కట్టుకుని కూచోకుండా తప్పనిపించిన ప్రతిసారి రేవంత్‌ను కడిగి పారేసింది. నేనే తోపు అని ఫీలైన రేవంత్ చేసే తప్పులను అందరి ముందే ఎత్తిచూపింది.
కానీ వెటకారం వల్ల గేమ్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. తాజాగా ఆమె.. తన ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ప్రియుడు పటాస్ ప్రవీణ్ బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఎలా వెల్‌కమ్ చెప్పారో చూడండంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో వదిలింది. ఇందులో ప్రవీణ్.. ఫైమాతో కేక్ కట్ చేయించాడు. కడప దర్గాలో పూజ చేయించిన నీళ్ల బాటిల్‌ను ఆమె చేతికిచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాడు . తర్వాత తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది.
చదవండి: శ్రీహాన్‌తో బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన సిరి
పూజ చేస్తున్న హీరో.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Tags : 1