Breaking News

ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్‌ అయిందా?

Published on Sat, 12/10/2022 - 15:45

'ఇనయ.. యూ ఆర్‌ ఎలిమినేటెడ్‌..' నాగార్జున ఈ మాట అనడాన్ని కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారా? కానీ జరిగేది ఇదేనని తెలుస్తోంది. టాప్‌ 2లో ఉంటుందనుకున్న ఇనయను అర్ధాంతరంగా ఎలిమినేట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక జరిగితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.

బిగ్‌బాస్‌కు వచ్చాక అభిమానులను సంపాదించుకున్నవారిలో ఇనయ ఒకరు. 'మై లైఫ్‌ మై రూల్స్‌' అనే ఆమె 'మై గేమ్‌ మై స్ట్రాటజీస్‌' అన్నట్లుగా ఆడింది. తన ఆటతీరుకు, ఎవరినైనా ఎదురించే ధైర్యానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. తనలో ఉన్న ఫైర్‌ను అలాగే కంటిన్యూ చేస్తే టాప్‌ 3లో చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా.

అన్నట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమెను సేవ్‌ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆమె నామినేషన్‌లోకి వచ్చింది. ఎప్పటిలాగే అనధికారిక పోల్స్‌లో మంచి ఓట్ల శాతంతో రెండు, మూడు స్థానాల్లో తచ్చాడుతోంది. శ్రీసత్య, కీర్తి చివరి ప్లేస్‌ నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ ఈ ఇద్దరిలో ఒకరిని పంపిచేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్‌ చేశాడట. అమ్మాయిల్లో ఫిజికల్‌ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్‌ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్‌ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇనయను సడన్‌గా ఎలిమినేట్‌ చేయడమేంటని అప్పుడే నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఒకవేళ బిగ్‌బాస్‌ కావాలని తప్పుడు సమాచారాన్ని లీక్‌ చేశాడా? అసలు ఈవారం శ్రీసత్య, కీర్తి, ఇనయలలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

చదవండి: లెక్క తేలింది, విన్నర్‌ ప్రైజ్‌మనీ ఎంతంటే?

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)