Breaking News

బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ షో వాళ్లు ఒప్పుకోలేదు: చలాకీ చంటి

Published on Wed, 09/07/2022 - 17:50

లైఫ్‌లో ఒక్కసారైనా బిగ్‌బాస్‌కు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. అదే సమయంలో బిగ్‌బాస్‌కు చచ్చినా వెళ్లమని కొందరు సెలబ్రిటీలు ముక్తకంఠంతో చెప్తుంటారు. కారణం.. బిగ్‌బాస్‌ ఓ మాయాజాలం. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టాక ఎలాంటి పేరుతో బయటకు వస్తామన్నది ఎవ్వరూ చెప్పలేరు. కొందరు పేరు ప్రతిష్టలతో బయటకు రావచ్చు, మరికొందరు అప్రతిష్టను మూటగట్టుకుని రావచ్చు.

అందుకే కొందరు తారలు ఈ షోకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తారు. అయితే అలా వెనకడుగు వేసేవారి కంటే వెళ్లాలని తాపత్రయపడేవాళ్లే ఎక్కువమంది! చలాకీ చంటి కూడా బిగ్‌బాస్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ మొదట్లో పెద్దగా లక్ష్యపెట్టలేదు. మూడుసార్లు ఈ రియాలిటీ షో నుంచి పిలుపు వచ్చినా లెక్కచేయలేదు. అయితే నాలుగోసారి మాత్రం ఆఫర్‌ రాగానే నో చెప్పేందుకు నోరు రాలేదన్నాడు చంటి.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను జబర్దస్త్‌ టీమ్‌లో మొదటి నుంచి కొనసాగుతున్నాను. నాకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని మల్లెమాల టీమ్‌కు చెప్పగానే వాళ్లు నో చెప్పారు. సంస్థలో సీనియర్‌గా కొనసాగుతున్న నేను ఇప్పుడు సడన్‌గా తప్పుకోవడం ఎందుకని వాళ్లు నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు వెళ్లడం? తొందరెందుకు, తర్వాత చూడండి అని అడిగారు. కానీ నాకు డబ్బులు కావాలి, కొన్ని బాధ్యతలున్నాయి.. వెళ్తానని చెప్పాను. కావాలంటే మనం వేరే షోలు ప్లాన్‌ చేద్దాం అన్నారు. నేను ఒప్పుకోలేదు. కావాలంటే బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాక ప్లాన్‌ చేద్దాం అని చెప్పాను. అంతేకాదు, బిగ్‌బాస్‌ అయిపోగానే జబర్దస్త్‌కు తిరిగి వచ్చేస్తానని చెప్పాను. ఈ మాట ఇంతకుముందెవరూ చెప్పలేదు. నేను తిరిగొస్తానని చెప్పడంతో వాళ్లు ఓకే అన్నారు' అని చెప్పుకొచ్చాడు చలాకీ చంటి.

చదవండి: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్‌లో ఉన్నది ఎవరెవరంటే?
బిగ్‌బాస్‌ హౌస్‌లో మొగుడుపెళ్లాల కొట్లాట

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)