Breaking News

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌తో రిలేషన్‌పై సిరి తల్లి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Thu, 11/25/2021 - 13:11

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రతి వారం లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. టాస్క్‌ ఎంత బాగా ఆడితే.. అదే స్థాయిలో లగ్జరీ బడ్జెట్‌ వస్తుంది. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ కోసం ‘బీబీ ఎక్స్‌ప్రెస్’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. . ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది.

గత సీజన్‌లో మాదిరిఫ్రీజ్‌, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ అనే టాస్క్‌లో ఇది చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక మధ్య మధ్యలో కుటుంబ సభ్యులను ప్రవేశపెడుతున్నాడు బిగ్‌బాస్‌. నిన్న కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చి సందడి చేశాడు. చాలా రోజుల తర్వాత కుటుంభ సభ్యులను కలవడంతో కాజల్‌ ఎమోషనల్‌ అయింది. ఇక నేటి ఎపిసోడ్‌లో  మానస్‌ తల్లితో పాటు.. సిరి తల్లి కూడా ఇంట్లో వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. మమ్మి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్‌. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

తర్వాత.. ఇంటి సభ్యులతో చాలా సరదాగా గడిపింది. ‘అరేయ్‌ ఏంట్రా షన్నూ’ అంటూ షణ్ముఖ్‌ని ఆటపట్టించింది. ఇక కాజల్‌ చాయ్‌ ఇవ్వనా అని అడగ్గా.. నీకు వంట చేయడం రాదుగా అంటూ పంచ్‌ వేసింది. శ్రీరామ్‌ ఆంటీ అని పిలవగా.. ‘ఎందుకు ఆంటీ అంటున్నావ్‌.. నేను నీ గర్ల్‌ఫ్రెండ్‌’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ఆమె తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సిరి ఫ్రీజ్‌లో ఉంది. సిరిని ఫ్రీజ్‌ నుంచి రిలీజ్‌ చేయగానే... వెళ్లి తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూతురిని బాగా ఆడుతున్నావ్‌ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్‌ కామెంట్‌ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్‌ సిరిగా బాగా హెల్ప్‌ చేస్తున్నాడని, అది తనకు నచ్చడం లేదని చెప్పింది. మరి సిరి తల్లి చేసిన కామెంట్స్‌ని షణ్ముఖ్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నాడో చూడాలి. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)