Breaking News

నా తల్లి పేరు కూడా అదే, అందుకే నామినేట్‌ చేయలేదు: షణ్నూ

Published on Fri, 09/10/2021 - 18:06

Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ షో అంటే నవరసాల కలయిక. కోపతాపాలు, కొట్లాటలు, చిరునవ్వులు, సుఖసంతోషాలు, కన్నీటి బాధలు, గెలుపోటముల కలయికలు, బంధాలు, వైరాలు, అలకలు, ఆటుపోట్లు.. ఇలా అన్నీ ఉంటాయి. ఇక ప్రతి సీజన్‌లో ముక్కు మీద కోపం ఉండే కంటెస్టెంట్లను మనం చూస్తూనే ఉన్నాం. మొదటి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో తనీష్‌ అల్లాడి, మూడో సీజన్‌లో అలీ రెజా, నాలుగో సీజన్‌లో సయ్యద్‌ సోహైల్‌ అతిగా ఆవేశపడేవారు. ఇక ఈ సీజన్‌లో ఆవేశం స్టార్లు ఎక్కువే ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే అయినదానికి కానిదానికి కూడా ఆవేశపడుతోంది మాత్రం నటి ఉమాదేవి అంటున్నారు నెటిజన్లు. తనకు ఆలూ కూర రాలేదని యానీ మాస్టర్‌ మీద శివాలెత్తిందావిడ. ఆ తర్వాత వెజ్‌, నాన్‌వెజ్‌ ఎవరు వండుతారని చర్చ నడుస్తుండగా లహరి.. వెజ్‌కైతే ప్రియాంక సింగ్‌ ఉందని చెప్పింది. అంటే నేను వెజ్‌కు పనికి రాను అంటున్నారు కదా! అని అనవసరమైన వాదనతో లేనిపోని గొడవ సృష్టించింది. మీరు వెజ్‌ చేయడానికి పనికి రారు అని ఎవరూ అనలేదని కెప్టెన్‌ సిరి గట్టిగా సమాధానమివ్వడంతో ముఖం మాడ్చుకుని సైలెంట్‌ అయిపోయింది. ఆమె వైఖరి చూసిన ఇతర కంటెస్టెంట్లు తనతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనుకుంటున్నారు.

తాజాగా ఆమె గురించి సిరి, కాజల్‌ దగ్గర ఓపెన్‌ అయ్యాడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆమె తనతో మాట్లాడటం లేదని, చాలా కోపంగా ఉంటున్నారని పేర్కొన్నాడు. నిజానికి ఆమెను మొన్న నామినేట్‌ చేయాలనుకున్నా.. కానీ తల్లి పేరు(ఉమ) కూడా అదే కావడంతో వదిలేశానని చెప్పుకొచ్చాడు. అసలు ఉమాదేవి షణ్నూమీద ఎందుకు కోపంగా ఉంది? వీరిద్దరి మధ్య దూరం చెదిరి కలిసిపోతారా? లేదా వచ్చేవారం ఉమాదేవిని షణ్నూ నామినేట్‌ చేస్తాడా? అనేది తప్పక చూడాల్సిందే!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)