Breaking News

అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన లేడీ రైతుబిడ్డ

Published on Sun, 09/06/2026 - 19:59

తొలి సీజన్ నుంచి బిగ్‌బాస్ షోలో సామాన్యులు పాల్గొన్నప్పటికీ మహా అయితే ఒకటి రెండు వారాలకు మించి ఉండేవాళ్లు కాదు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్, కల్యాణ పడాల లాంటి వాళ్లు ఏకంగా విజేతలయ్యారో.. కామనర్స్ అనే పదానికి విలువ పెరిగింది. వీళ్లని ఎంపిక చేసేందుకు పెట్టిన అగ్నిపరీక్ష పోటీపైనే ఆడియెన్స్‌కి ఆసక్తి కలిగింది. అలా ఈసారి జరిగిన అగ్నిపరీక్షలో నెగ్గిన సింగర్ ఝాన్సీ ఇప్పుడు సగర్వంగా బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి     కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేసింది.

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్‌తో గెలిచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)