Breaking News

'బ్లాక్‌ అండ్‌ వైట్‌ బోర్‌'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్‌ బర్డ్స్‌

Published on Sat, 12/20/2025 - 13:25

బిగ్‌బాస్‌ 7 ఫేమ్‌ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్‌ మైసూర్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.

లగ్జరీ కారు కొనుగోలు
అయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఈ లవ్‌ బర్డ్స్‌ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్‌ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్‌ బెంజ్‌ AMG45S స్పెషల్‌ ఎడిషన్‌. 

ఇకనైనా మారండి
ఈ మోడల్‌ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్‌ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్‌ కొట్టే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్‌ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్‌ కలర్‌లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్‌.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్‌ డైరీస్‌, హ్యాంగ్‌మ్యాన్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్‌ సాంగ్స్‌, పలు షార్ట్‌ ఫిలింస్‌లో నటించాడు.

 

 

Videos

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

కోతుల కోసం చింపాంజీ ఐడియా

Photos

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)