విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
Published on Wed, 03/04/2026 - 19:09
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్‌లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది.
బిగ్‌బాస్ షోతో గుర్తింపు
కొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది.
తోడు కావాలి
ఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.
రెండో పెళ్లి
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్‌గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం!
Tags : 1