Breaking News

కూతురి ఫస్ట్‌ బర్త్‌డే.. బిగ్‌బాస్‌ జంట ఎమోషనల్‌

Published on Mon, 01/12/2026 - 17:20

బుల్లితెర జంట, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెరీనా అబ్రహం- రోహిత్‌ సాహ్ని గతేడాది పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

జీవితం పరిపూర్ణం
ఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్‌గా, అలాగే సాఫ్ట్‌గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.

లవ్యూ టియారా: రోహిత్‌
'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్‌ ఎమోషనలయ్యాడు.

సీరియల్‌, సినిమా
అమెరికా అమ్మాయి సీరియల్‌తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్‌తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో జంటగా పార్టిసిపేట్‌ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్‌ అవగా రోహిత్‌ మాత్రం ఫైనల్స్‌ వరకు వెళ్లాడు. సీరియల్స్‌కు దూరమైన వీరిద్దరూ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. రోహిత్‌ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

 

 

చదవండి: భారీగా పడిపోయిన రాజాసాబ్‌ కలెక్షన్స్‌

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు