Breaking News

పాపకు, నాకు డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి

Published on Tue, 04/08/2025 - 13:22

చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్‌ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్‌ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్‌ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.

నా వెంటపడ్డాడు
నాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్‌లో ఉండేసరికి అతడి లవ్‌ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్‌ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్‌ ఉందని అనుమానించేవాడు.

బిగ్‌బాస్‌కు వెళ్లేముందే..
ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్‌ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్‌ చేయాలి, రీల్స్‌ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్‌ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్‌ బ్రేకప్‌ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించాలనుకున్నారు. 

అక్కడే ఆగిపోయాడు
వాళ్లు డీఎన్‌ఏ టెస్ట్‌ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్‌ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్‌కు వచ్చాను అని కీర్తి భట్‌ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్‌ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.

చదవండి: నేను సింగిల్‌.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్‌ హీరో

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)