Breaking News

బీబీ జోడి జడ్జస్‌పై బిగ్‌బాస్‌ కౌశల్ షాకింగ్‌ కామెంట్స్‌, పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 02/21/2023 - 11:49

బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌తో స్టార్‌ మా బీబీ జోడి అనే డాన్స్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో పాల్గొన్న పలువుడు కంటెస్టెంట్స్‌ జోడిగా పెర్పామెన్స్‌ ఇస్తున్నారు. ఇందులో సహా కంటెస్టెంట్స్‌ జోడిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు బిగ్‌బాస్‌ హౌజ్‌లో మాదిగా స్కోర్స్‌ విషయంలో స్ట్రాటజీ అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ జోడి తమ స్ట్రాటజీ  వాడి ఎలిమేనేట్‌ అయ్యింది. ఇక దీనిని తప్పు బడుతూ షో జడ్జస్‌ అయిన తరుణ్‌ మాస్టర్‌, నటి రాధపై అసహనం వ్యక్తం చేశాడు బిగ్‌బాస్‌ విన్నర్‌, నటుడు కౌశల్‌ మండా. 

చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్‌ మృతి

ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ బీబీ జోడి షోలో పలువురు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ జోడి కట్టి తమ డాన్స్‌ పర్ఫామెన్స్‌తో అదరగొడుతున్నారు. అందులో చెప్పుకొదగ్గ జోడిల్లో రవికృష్ణ, భాను జోడి ఒకటి. చెప్పాలంటే బిబి జోడి టైటిల్‌ కొట్టే సత్తా వారిలో ఉంది. అయితే గతవారం జరిగిన ఎపిసోడ్‌లో రవి, భాను స్ట్రాటజీ వాడి షో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కో-కంటెస్టెంట్స్‌ అయిన వాసంతి-అర్జున్‌ కల్యాణ్‌ జోడి తమ డాన్స్‌తో జడ్జస్‌ను మెప్పించారు. వారి చేత వావ్‌ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ఇక సహ కంటెస్టెంట్స్‌ కూడా వారి డాన్స్‌ని మెచ్చకుంటూ స్కోర్స్‌ ఇచ్చారు. అయితే రవి-భాను మాత్రం ఒక్క మార్కే ఇచ్చి షాకిచ్చారు. 

ఇది నిజమా? ప్రాంక్‌గా అని జడ్జస్‌ అడుగగా.. ఇది తమ స్ట్రాటజీ అని సమాధానం ఇచ్చారు. నిజానికి వారి ప్రెర్ఫామెన్స్‌కి 10 మార్కులు ఇవ్వాలి, కానీ తాము సేవ్‌ అవ్వాలంటే వారికి ఒక్క మార్కు ఇచ్చామన్నారు. దీంతో జడ్జస్‌ కూడా తమ స్ట్రాటజీని వాడి వారికి అతి తక్కువ మార్కులు ఇచ్చారు. ఫలితంగా భాను-రవి ఎలిమేనేషన్‌ ఫేస్‌ చేసి షో నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపై కౌశల్‌ మండా స్పందిస్తూ జడ్జస్‌పై తీరు తప్పుబడ్డాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో వివాదస్పద పోస్ట్‌ షేర్‌ చేశౠడు. ‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్‌లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం.

చదవండి: ఆ మూవీ నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడా? కారణం ఇదేనా!

బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కు ఉంది. కానీ న్యాయనిర్ణేతలకు లేదు. జడ్జస్‌ కేవలం కంటస్టెంట్స్‌ డాన్స్‌ మాత్రమే జడ్జ్‌ చేయాలి, వారి వ్యూహలను కాదు. బిగ్‌బాస్‌లో ఏ జోడి గెలిచిన అది రవి-భాను తర్వాతే అనేది నా అభిప్రాయం. నాకు అనిపించింది చెప్పాను. నిజాన్ని మనసులోనే దాచుకోలేను. క్షమించండి జడ్జస్‌’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కౌశల్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందర అతడిని తప్పుబడుతున్నారు. రవి భాను కేవలం ఒక్క మార్క్‌ ఇవ్వడం కరెక్ట్‌ కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇదే షోలో కౌశల్‌ కూడా కంటెస్టెంట్‌గా ఉండటం గమనార్హం. అభినయ శ్రీతో జోడి కట్టి తన డాన్స్‌తో మెప్పిస్తున్నాడు కౌశల్‌. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)