నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్
Published on Tue, 06/30/2026 - 11:52
కన్నడ సీరియల్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య సురేశ్.. బెంగళూరులో ఆదివారం రాత్రి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. తన కజిన్‌తో కలిసి కారువైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి తమని వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమె ఆరోపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలానే ఈమె తీసిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన యంగ్ హీరోయిన్)
దివ్య సురేశ్ చెప్పిన దాని ప్రకారం.. రాత్రి 11:30 గంటల టైంలో ఓ వ్యక్తి తమని అనుసరిస్తూ బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతడిని వెంటనే ప్రశ్నించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని, కారులోకి ఎక్కేవరకు వెంటాడుతూనే ఉన్నాడని ఇన్ స్టాలో స్టోరీలో రాసుకొచ్చింది. రాత్రిపూట రోడ్డుపై నడిచిందనే కారణంతో ఏ మహిళా ఇలాంటి వేధింపులని ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. ఇక బెంగళూరు పోలీసులని ట్యాగ్ చేస్తూ.. మహిళలకు భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. ఆ భద్రత ఎక్కడ? అని ప్రశ్నించింది.

33 ఏళ్ల దివ్య.. 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత #9, హిల్టర్ క్రాస్, రౌడీ బేబీ, కెంపు హలడి హసిరు, హిరణ్య తదితర మూవీస్ చేసింది. 2021లో ప్రసారమైన బిగ్‌బాస్ కన్నడ 8వ సీజన్లో పాల్గొంది. జోడీ హక్కి, నన్ను హెండ్తి ఎమ్‌బీబీఎస్ సీరియల్స్‌లో కూడా చేసింది. కాగా గతేడాది అక్టోబరులో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఈ నటి పేరు వినిపించింది.
(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)
'ಬಿಗ್ ಬಾಸ್' ದಿವ್ಯಾ ಸುರೇಶ್ಗೆ ಎದುರಾಯ್ತು ವಿಕೃತ ಯುವಕನ ಕಾಟ! | Youth Misbehaves In Front of Divya Suresh
.
.
.
.
.#DivyaSuresh #BiggBossKannada #NammaBengaluru #WomenSafety #KanakapuraRoad #BengaluruNews #ಮಹಿಳಾಸುರಕ್ಷತೆ #ದಿವ್ಯಾಸುರೇಶ್ #ಬೆಂಗಳೂರು pic.twitter.com/2yUTl9wAYo— Sanjevani News (@sanjevaniNews) June 30, 2026
Tags : 1