Breaking News

‘మీ అమ్మకు అలా మెసేజ్‌ చేస్తే ఓకేనా?’.. నెటిజన్‌పై శ్వేతవర్మ ఫైర్‌

Published on Thu, 04/25/2024 - 15:58

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్‌ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ  కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది.

 సోషల్‌ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తన పర్సనల్‌ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునే శ్వేతకు సోషల్‌ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్‌ భాగాలపై నీచంగా కామెంట్‌ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్‌ని స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది.

‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్‌, కాంటాక్ట్‌ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్‌స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్‌ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్‌ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)