వివాదాస్పద నటితో పెళ్లి-విభేదాలు.. ఇప్పుడు రెండో షాదీ..

Published on Fri, 03/08/2024 - 14:15

బిగ్‌బాస్‌ షోతో బాగా క్లిక్‌ అయింది రాఖీ సావంత్‌. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుందీ నటి. గతంలో ఈమె రితేశ్‌ సింగ్‌ను పెళ్లాడింది. ఆల్‌రెడీ అతడికి పెళ్లైన విషయం ఆలస్యంగా తెలియడంతో ఆమె మనసు ముక్కలైంది. అతడికి పెళ్లాంపిల్లలు ఉన్నందున తన పెళ్లి చెల్లదంటూ రితేశ్‌తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది.

అతడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టింది. కానీ వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. గొడవలు పీక్స్‌కు వెళ్లడంతో భర్తను జైల్లో పెట్టించింది. అతడితోనూ విడిపోయింది. ఆమధ్య మరోసారి ప్రేమలో పడ్డానంది కానీ దాని గురించి మళ్లీ మాట్లాడనేలేదు. మరోవైపు అదిల్‌ ఖాన్‌ రెండోసారి పెళ్లిపీటలెక్కాడు. హిందీ బిగ్‌బాస్‌(12వ సీజన్‌) కంటెస్టెంట్‌ సోమి ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. ఏడు నెలలుగా ఆమెతో ప్రేమలో ఉన్న అతడు చివరకు పెళ్లితో ఒక్కటైనట్లు తెలుస్తోంది. అయితే ఇది తనకు రెండో పెళ్లి కాదని, మొదటి పెళ్లని చెప్తున్నాడు.

అదెలాగో తర్వాతి రోజుల్లో చెప్తానంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నామని, ముంబైకి రాగానే అన్ని విషయాలు వివరంగా వెల్లడిస్తానంటున్నాడు. అదిల్‌- సోమి ఖాన్‌ వివాహం మార్చి 3న జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలను అదిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమను ఆశీర్వదించమని కోరాడు. ఇది చూసిన జనాలు.. రాఖీతో ఎంగేజ్‌మెంట్‌.. షాదీ.. బ్రేకప్‌ జరిగిపోయాయి. అంతలోనే మళ్లీ పెళ్లి చేసుకున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఎంతటి విషాదం.. క్యాన్సర్‌తో నటి కన్నుమూత.. ముందురోజే సోదరి మృతి

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)