Breaking News

బిగ్‌బాస్‌ 'నబీల్‌' కొత్త కారు.. నిద్రలేని రాత్రులు గడిపానంటూ..

Published on Sun, 04/20/2025 - 12:00

యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నబీల్‌ అఫ్రిది (Nabeel Afridi) కొత్త కారు కొనుగోలు చేశాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ700ఏఎక్స్‌7 లగ్జరీ కారును ఇంటికి తెచ్చేసుకున్నాడు. మొత్తానికి తన సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు కారు వీడియోను షేర్‌ చేశాడు. ఒకప్పుడు ఏడు సీటర్ల కారు గురించి కలలు కనేవాడిని.. ఇప్పుడేకంగా మహీంద్రా లగ్జరీ కారును సొంతం చేసుకున్నాను. జీరో సబ్‌స్క్రైబర్లు, జీరో ఫాలోవర్ల నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. 

మీ వల్ల కూడా అవుతుంది
మనసు నిండా ఆలోచనలు, ఒక నోట్‌ప్యాడ్‌తో నా జర్నీ మొదలైంది. ఎన్నో కష్టనష్టాలను చూశాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక మైల్‌స్టోన్‌. నేను నా కలను నిజం చేసుకున్నానంటే మీరు కూడా మీ కలను సాకారం చేసుకోగలరు. ముందు కలగనండి.. దానికోసం ప్రయత్నించండి.. తర్వాత దాన్ని సాకారం చేసుకోండి అని క్యాప్షన్‌ జోడించాడు. అభిమానులు లేకపోయుంటే ఇంతదూరం వచ్చేవాడినే కాదంటూ నబీల్‌ ఎమోషనలయ్యాడు.

కొత్త కారు ధరెంతంటే?
కొత్త కారు కొన్న నబీల్‌కు ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెప్తున్నారు. 2025లో లాంచ్‌ అయిన ఈ మోడల్‌ కారు ధర రూ.25 లక్షల పైనే ఉందని తెలుస్తోంది. నబీల్‌ అఫ్రిది.. వరంగల్‌ డైరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో ఫేమస్‌ అయ్యాడు. అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ షోలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

 

 

చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)