Breaking News

బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్‌ ఇండియా మూవీ.. లుక్‌ అదిరింది!

Published on Wed, 12/10/2025 - 17:41

బిగ్ బాస్ గేమ్‌ షోతో బాగా పాపులర్‌ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్‌బాస్‌ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్‌లో ఓ చిన్న రోల్‌ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా  చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్‌లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్‌లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)