Breaking News

సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్‌.. అప్పుడు తారక్‌ ఏం చేశారంటే?

Published on Mon, 01/02/2023 - 18:15

బిగ్‌బాస్‌ షోకి స్పెషల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రతి ఏడాది ఎప్పుడెప్పుడు బిగ్‌బాస్‌ ప్రారంభమవుతుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అభిమానులు. కానీ ఆరో సీజన్‌ పుణ్యమా అని మెచ్చినవాళ్లే మండిపడ్డారు. చెత్త కంటెస్టెంట్లు, చెత్త సీజన్‌ అని ఈసారి బిగ్‌బాస్‌ షోను ఏకిపారేశారు. మొదట్లో బాగానే ఉండేది కానీ రానురానూ మరీ దారుణంగా తయారవుతుందని పెదవి విరిచారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మొదటి సీజన్‌ కంటెస్టెంట్‌ సమీర్‌. 'మా సీజన్‌లో చాలా బాగా ఉండేది. కానీ ఈసారి స్క్రిప్టెడ్‌ అయిందేమోనని అందరూ డౌట్‌ పడుతున్నారు. అయితే మా సీజన్‌లో సంపూర్ణేశ్‌ బాబు స్వతాహాగా ఎలిమినేషన్‌కు సిద్ధపడటాన్ని కూడా కొందరు స్క్రిప్ట్‌ అనుకున్నారు, కానీ అసలు నిజమేంటంటే.. అతడు పల్లెటూరి వ్యక్తి, పల్లెటూరి వాతావరణాన్ని అతడు బాగా ఇష్టపడతాడు. ఇప్పటికీ షూటింగ్‌ అయిపోగానే సిటీలో ఉండలేక తిరిగి సిద్దిపేటకు వెళ్లిపోతాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహల్‌ లాంటి బిగ్‌బాస్‌ హౌస్‌లో పడేశారు. ఒక వారం ఉన్నాడు, కానీ తనవల్ల కాలేదు.

గదిలో బంధించినట్లుగా ఫీలయ్యాడు. మైండ్‌ డిస్టర్బ్‌ అయింది, ఆ క్షోభ భరించలేక నిజంగా ఏడ్చాడు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. గేట్లు ఓపెన్‌ చేయండి, వెళ్లిపోతా.. లేదంటే గేట్లు పగలగొట్టుకుని వెళ్లిపోతానన్నాడు. కానీ బిగ్‌బాస్‌లో అగ్రిమెంట్లు ఉంటాయి. ఎలిమినేషన్‌ ద్వారా వెళ్లిపోతే ఓకే కానీ తనంతట తానుగా వెళ్లాలంటే తిరిగి రూ.25 లక్షలు కట్టాలి. డబ్బులు కట్టడానికైనా సరే కానీ ఉండనని ఏడుస్తూనే ఉన్నాడు. సరిగా తిండి కూడా తినలేదు. సంపూ పరిస్థితి చూసి తారక్‌ బిగ్‌బాస్‌ టీమ్‌తో మాట్లాడాడు. పాతిక లక్షలు కట్టకుండానే అతడిని హౌస్‌ నుంచి పంపించేశాడు. ఇప్పుడంటే సిటీ మధ్యలోనే బిగ్‌బాస్‌ హౌస్‌ ఏర్పాటు చేస్తున్నారు. కానీ, మాది మహారాష్ట్ర లోనావాలాలోని అడవిలో సెట్‌ వేశారు' అని చెప్పుకొచ్చాడు సమీర్‌.

చదవండి: ఏమున్నాడ్రా బాబూ, హృతిక్‌ రోషన్‌ ఎయిట్‌ ప్యాక్‌ లుక్‌ వైరల్‌
వంద కోట్లకు చేరువలో ధమాకా

Videos

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

Photos

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)