Breaking News

కోట్ల ఆస్తిని సంపాదించిన గంగవ్వ.. మొత్తం ఎంతంటే?

Published on Wed, 09/11/2024 - 21:20

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అంతో ఇంత పాపులారిటీ వస్తుంది. బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ఫేమ్‌తో కెరీర్‌ను మంచిగా బిల్డ్‌ చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగినవారూ ఉన్నారు. అయితే బిగ్‌బాస్‌ షోలోనే సంచలనంగా నిలిచిన గంగవ్వ ఈ రియాలిటీ షో తర్వాత కూడా తనకు నచ్చినట్లుగా యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ హాయిగా జీవిస్తోంది.

ఇంటికి ఎంత ఖర్చయిందంటే?
తాజాగా ఆమె ఆస్తులు, సంపాదన గురించి మై విలేజ్‌ షో టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ (నాలుగో సీజన్‌) తర్వాత తన జీవితం చాలా మారిందంటూ తన ఇల్లు చూపించింది. రియాలిటీ షో తర్వాతే కట్టుకున్న ఈ ఇంటికి రూ.22 లక్షలు అయిందని తెలిపింది. తనకు ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది.

వ్యవసాయ భూములు
ఆవుల్ని కొని, షెడ్డు నిర్మించడానికి మొత్తం రూ.3 లక్షలు అయిందని వివరించింది. తర్వాత తను కొన్న నాలుగున్నర గుంటల పొలాన్ని చూపించింది. దీని ధర ఇప్పుడు రూ. 9 లక్షలు. అలాగే మరో చోట ఉన్న రెండున్నర ఎకరాల పొలం చూపించింది. ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోందట! ఇంకోచోట ఉన్న కమర్షియల్‌ ప్లాట్‌ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు రూ.3 లక్షలయిందని పేర్కొంది. 

అదే తన కోరిక
మరో వ్యవసాయ భూమిని చూపిస్తూ.. ఇక్కడ 15 గుంటల భూమి ఉందని.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్‌ ప్లాట్స్‌ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తోంది. తనకంటూ ఐదు తులాల బంగారం ఉందన్న గంగవ్వ ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చాం.

చదవండి: నాగమణికంఠ భార్యపై ట్రోలింగ్‌.. మరీ, ఇంత ఘోరమా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)