Breaking News

ట్రాన్స్‌జెండర్‌గా సీజన్-7 బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Sun, 12/24/2023 - 16:35

ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్‌ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో టాప్-3లో ప్రశాంత్, అమర్‌దీప్‌, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్‌ టాప్‌-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్‌ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్‌ కంటే ముందే ఓ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అయితే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్‌-6లో నిలిచారు. అయితే అర్జున్‌ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేశాడు.

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ అర్జున్‌కు సినిమా ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ బుచ్చిబాబు..!)

ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ షోను ఎంచుకున్నారు. 

అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా.. 

అర్ధనారి సినిమాలో అర్జున్‌ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్‌ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌లో కనిపించి మరింత ఫేమస్‌ అయ్యారు. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్‌-6లో నిలిచారు.  అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి