Breaking News

అయోధ్య రామ మందిరానికి బిగ్‌ బాస్‌ 'ఆదిరెడ్డి' విరాళం

Published on Thu, 01/11/2024 - 09:46

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు. ఆయల నిర్మాణం పూర్తిచేసుకుని రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమంగా ఘనంగా జరగనుంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దీంతో లక్షల మంది భక్తులు ముందుకు వచ్చారు. 

తాజాగా  ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా చేరాడు. మొదట  బిగ్ బాస్ షో మీద రివ్యూలు చేస్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి.. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎవరూ ఊహించని విధంగా టాప్‌-5 వరకు చేరుకున్నాడు. ఆయన జీవితాన్ని బిగ్‌ బాస్‌ మార్చేసింది అంటూ ఆయన పలుమార్లు చెబుతూ ఉంటాడు కూడా.. తాజాగా  'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు ఆయన విరాళం అందించాడు.

రామ మందిరం అనేది మనందరి కల, హిందువుల కల కాబట్టి తనవంతుగా ఉడుతా భక్తిగా ఈ విరాళం అందించానని ఆయన పేర్కొన్నాడు. అందరూ కూడా తమ వంతుగా డొనేట్ చేయాలని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు రామ మందిరానికి విరాళాల రూపంలో సుమారు రూ. 3,200 కోట్లు వచ్చినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో ఈ డబ్బు జమ అయింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)