Breaking News

నీకెందుకే అంత యాటిట్యూడ్‌? రీతూపై విషం కక్కిన ఆయేషా..

Published on Mon, 10/20/2025 - 12:41

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్‌, ప్రియ, మాస్క్‌ మ్యాన్‌ హరీశ్‌, శ్రీజ, భరణి వరుసగా హౌస్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు మరొకరిని పంపించేందుకు నామినేషన్స్‌ షురూ అయ్యాయి. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది.

కెప్టెన్ల చేతిలో పవర్‌
నామినేషన్‌ చేసే హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుందన్నాడు బిగ్‌బాస్‌. ఆ పోరాటానికి ఇద్దర్ని ఎంపిక చేసుకోమని కెప్టెన్స్‌కు పవర్స్‌ ఇచ్చారు. దీంతో గౌరవ్‌.. ఆయేషాను, సుమన్‌.. ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశాడు. ఆయేషా, ఇమ్మూకి బిగ్‌బాస్‌ బెలూన్ల టాస్క్‌ ఇచ్చాడు. బెలూన్‌ పగలగొట్టినప్పుడు అందులో ఓ చిట్టీ వస్తుంది. దానిపై రాసున్నదాని ప్రకారం నామినేషన్స్‌ ముందుకు సాగుతాయి. ఈ ‍క్రమంలో ఆయేషా.. రీతూను డైరెక్ట్‌గా నామినేట్‌ చేసింది. 

నామినేషన్స్‌
నువ్వు, నీ ఓవరాక్షన్‌ నచ్చలేదు. నువ్వు లవ్‌ కంటెంట్‌ కోసం వచ్చావు అంటూ పర్సనల్‌ అటాక్‌ చేసింది. దానికి రీతూ.. నేను లవ్‌ చేస్తున్నానని చెప్పానా? అని నిలదీసింది. అప్పటికీ తగ్గని ఆయేషా... నీకంత యాటిట్యూడ్‌ ఎందుకే? నీ గేమ్‌ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని మండిపడింది. చూస్తుంటే వీరిమధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియా లీక్స్‌ ప్రకారం.. రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్‌ నామినేట్‌ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయేషా నామినేషన్‌లో ఉండాల్సింది. కానీ గౌరవ్‌ సేవ్‌ చేయడంతో ఆమె గండం గట్టెక్కింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)