Breaking News

బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ

Published on Wed, 10/15/2025 - 12:09

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9)లో జైలు జీవితం అంటే ఎవరైనా బాధపడతారు, అవమానంగా ఫీలవుతారు. కానీ, ఫ్లోరా మాత్రం తెగ సంబరపడిపోయింది. దొరికిందే ఛాన్స్‌ అన్నట్లుగా జైల్లో అడుగుపెట్టింది. ఆమెను రిలీజ్‌ చేయమని బిగ్‌బాస్‌ కెప్టెన్‌ను ఆదేశించినప్పుడు మాత్రం తెగ బాధపడిపోయింది. అప్పుడే అయిపోయిందా! అని నిరాశచెందింది.

ఐదో వారం ఎలిమినేట్‌
దానికి కారణం.. హౌస్‌మేట్స్‌తో పెద్దగా కలవదు. తన పనేదో తను చేసుకుపోతోంది. హౌస్‌లో ఉండాలన్న ఆసక్తి కూడా తనకేమంత లేదు. ప్రతివారం ఎలిమినేషన్‌కు రెడీగా ఉంది. ఒకానొక సమయంలో తను సేవ్‌ అయినట్లు నాగార్జున చెప్పగానే ఏంటి? నిజమా! అని నోరెళ్లబెట్టింది. తను కోరుకున్నట్లుగా ఐదో వారం హౌస్‌ నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చేసింది. తాజాగా సాక్షి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లోరా పెళ్లి గురించి ఓపెన్‌ అయింది. 

అందుకే నాకు పెళ్లొద్దు
'నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న రెండుమూడేళ్లకే విడాకులు అవుతున్నాయి. అలా నా ఫ్రెండ్స్‌ను చాలామందిని చూశాను. కాబట్టి వివాహం జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.. రిలేషన్‌షిప్‌లోనే సంతోషంగా ఉన్నాను' అని ఫ్లోరా సైనీ చెప్పుకొచ్చింది. ఫ్లోరా సైనీ మరో పేరు ఆశా సైనీ. ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావ్‌, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు వంటి పలు సినిమాలు చేసింది. పదేళ్లుగా హిందీలోనే చిత్రాలు చేస్తోంది.

చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్‌.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు