Breaking News

'బిగ్ బాస్' విన్నర్‌ ప్రైజ్‌ మనీ రివీల్‌ చేసిన నాగ్‌.. హిస్టరీలో ఇదే టాప్‌

Published on Sun, 12/15/2024 - 11:00

బిగ్‌ బాస్‌ 8 తెలుగు ఫైనల్‌కు చేరుకుంది. నేడు విజేత ఎవరో తేలనుంది. టైటిల్‌ రేసులో గౌతమ్‌, నిఖిల్‌,నబీల్‌,ప్రేరణ,అవినాష్‌ ఉన్నారు. వీరిలో గెలుపొందిన విజేతకు ప్రైజ్‌ మనీతో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. సుమారు 100 రోజులకు పైగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వారందరూ ప్రేక్షకులను మెప్పించారు. హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున మాత్రమే వారితో టచ్‌లో ఉండేవారు. అయితే, తాజాగా బిగ్‌ బాస్‌ ఫైనల్‌కు సంబంధించిన ఫస్ట్‌  ప్రోమోను విడుదల అయింది. అందులో ప్రైజ్‌ మనీ, ట్రోఫీని నాగ్‌ రివీల్‌ చేశారు.

బిగ్‌ బాస్‌ విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్‌ అందరూ కనిపించారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున ప్రైజ్‌ మనీ రివీల్‌ చేశారు. విజేతకు రూ. 55 లక్షలు అందేజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిగ్‌ బాస్‌లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం అని నాగ్‌ తెలిపారు. గతంలో రూ. 50 లక్షలు వరకు మాత్రమే విజేతకు ఇస్తుండగా.. ఈసారి ప్రైజ్‌ మనీ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఈ సీజన్‌ విన్నర్‌ మారుతి కార్‌ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

బిగ్ బాస్ 8 ఫైనల్స్‌ ప్రోమోలో  కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన నటించిన కొత్త సినిమా 'యూఐ' ప్రమోషన్స్‌లో భాగంగా షోలో పాల్గొన్నారు. మొదటి ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ అయన అవినాష్‌ను ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి డాకు మహారాజ్ టీమ్‌ కూడా వెల్లింది. హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్ హౌజ్‌లోకి వెళ్లి కొంత సమయం పాటు సరదాగా వారితో గడిపింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)