Breaking News

నాపై ఎవరూ ఇంత సీరియస్‌ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు

Published on Thu, 11/07/2024 - 17:21

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెండర్‌షిప్‌ బ్యాడ్జ్‌ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్‌లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.

సారీ చెప్పు
వేరేవాళ్లను హర్ట్‌ చేసేసి అతడు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.

ఇకపై పృథ్వీకి దూరంగా?
ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్‌ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.

అక్కా అని పిలవకు
ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్‌ టాస్క్‌లో అవినాష్‌, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్‌ రోల్‌ చేసిన అవినాష్‌ ఏబీసీ అనే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్‌లో యష్మి, నిఖిల్‌, గౌతమ్‌ ఓ సీన్‌ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్‌ వాదించాడు. ఇంతలో నిఖిల్‌ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్‌.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్‌తో అందరూ నవ్వేశారు.

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)