Breaking News

బిగ్‌బాస్‌లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ

Published on Tue, 11/12/2024 - 12:03

బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్‌మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్‌లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్‌లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.

షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో మొదటిగా ఇతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)

మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్‌పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అ‍య్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గత వీకెండ్‌లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్‌కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్‌లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్‌మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.

(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)