Breaking News

పృథ్వీ వంకర చూపులు.. బిగ్‌బాస్‌లో గలీజు ప్రవర్తన!

Published on Mon, 10/21/2024 - 10:57

నలుగురు చూసే షోలో ఉన్నప్పుడు కాస్త ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఆడుతున్న పృథ్వీకి అలాంటి లక్షణాలు అసలు లేవనిపిస్తుంది. ఎందుకంటే గతవారం అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేశాడు. నామినేషన్స్‌లో ప్రేరణని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు రోహిణితో గలీజుగా ప్రవర్తించాడు.

(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)

ఏడో వారం మణికంఠ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఎప్పటిలానే ఎనిమిదో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. దిష్టిబొమ్మకు కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. మణికంఠ విషయంలో మెహబూబ్‌కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సిందనే కారణంతో విష్ణుప్రియ.. నిఖిల్‌ని నామినేట్ చేసింది. ఫుడ్ విషయంలో ప్రేరణని కూడా నామినేట్ చేసింది. 


అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన రోహిణి.. రూల్స్ అసలు వినట్లేదని, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావని కారణాలు చెప్పింది. గతవారం జరిగిన ఓవర్ స్మార్ట్ గేమ్ గురించి ప్రస్తావించి కేబుల్ మొదట్లోనే మడతపెట్టి జేబులో పెట్టేస్తా ఎలా? అని ప్రశ్నించింది. అది నా స్ట్రాటజీ అని పృథ్వీ చెప్పడంతో.. అలాంటప్పుడు గేమ్ ఎక్కడ మొదలవుతుంది, గేమ్ ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎలా? అని వరసగా సరైన కౌంటర్లు వేసేసరికి పృథ్వీ సైలెంట్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)

తనవంతు వచ్చేసరికి రోహిణిని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆటలో మీరు జీరో అనిపిస్తున్నారని కారణం చెప్పాడు. ఆటలో ఎఫర్ట్స్ పెట్టట్లేదా? అని రోహిణి అడిగితే.. అలా కాదని అన్నాడు. ఇదంతా చూస్తుంటే పృథ్వీ పగతో చేసిన నామినేషన్‌లా అనిపించింది తప్పితే సరైన కారణమే కనిపించలేదు. చివర్లో మాటామాటా పెరిగిన టైంలో రోహిణిని పై నుంచి కిందవరకు పృథ్వీ ఆదో రకంగా చూశాడు. అలా చూడటం నాకు నచ్చలేదని చెప్పి రోహిణి పెద్ద గొడవే పెట్టుకుంది.

బిగ్‌బాస్ షోలో పృథ్వీ ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోంది. గతవారం అవినాష్‌తో మాట్లాడుతూ మీ భార్యనే షోకి పంపాల్సింది అనడం గానీ.. తను నామినేట్ అయ్యేలా చేసిందని చెప్పి ప్రేరణని మానసికంగా వేధించడం గానీ చూస్తుంటే పృథ్వీకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనిపిస్తుంది. అసలు ఇతడిని బిగ్‌బాస్ నిర్వహకులు ఇన్నాళ్లు ఎందుకు భరిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)