Breaking News

మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?

Published on Mon, 09/30/2024 - 11:04

ఆదివారం ఎపిసోడ్‪‌లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అలా బిగ్‌బాస్ షో ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. ఈసారి ఫొటోని మంటల్లో వేసే కాన్సెప్ట్‌తో నామినేషన్స్ సాగింది. ఎప్పటిలానే మణికంఠ టార్గెట్ అయ్యాడు. సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది.

(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)

ప్రోమో ప్రకారం మణికంఠ.. సరిగా ఆడట్లేదని నైనికని నామినేట్ చేశాడు. అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు. నైనిక-నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సీత-మణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు. ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. దీంతో మణికంఠకి మెంటలెక్కిపోయింది.

బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంఠ చెప్పగా.. ఇది నా బాడీ లాంగ్వేజ్, నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్‪‌లో ఉన్నారు. అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)