అభయ్‌ ఎలిమినేట్‌.. తన గొయ్యి తనే తీసుకున్నాడు!

Published on Sat, 09/21/2024 - 21:01

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్‌ విషయంలో ఇది నిరూపితం కాబోతోంది. మూడో వారం అభయ్‌ నవీన్‌ ఎలిమినేట్‌ కానున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ అయిపోవడంతో తన ఎలిమినేషన్‌ గురించి లీకులు బయటకు వచ్చేశాయి. నిజానికి అభయ్‌ ఎలిమినేట్‌ అయ్యేవాడే కాదు, అసలు నామినేట్‌ అయ్యేవాడు కూడా కాదు!

సెల్ఫ్‌ నామినేట్‌
సోమవారం నామినేషన్స్‌ జరిగే సమయానికి హౌస్‌లో నిఖిల్‌, అభయ్‌ ఇద్దరూ చీఫ్స్‌గా ఉన్నారు. బిగ్‌బాస్‌ వీరిలో ఒకరు నామినేట్‌ కావాలని చెప్పాడు. దీంతో అభయ్‌, నిఖిల్‌ చర్చించుకున్నారు. నిఖిల్‌ తాను నామినేట్‌ అవుతానంటే అభయ్‌ అందుకు ఒప్పుకోలేదు. సేవ్‌ అవుతానన్న నమ్మకంతో తానే నామినేషన్‌లోకి వెళ్తానన్నాడు. 

పర్ఫామెన్స్‌ సున్నా
చీఫ్‌ అయ్యానంటే తనలో కూడా ఏదో టాలెంట్‌ ఉండే ఉంటుంది, అందరూ తనను సపోర్ట్‌ చేస్తున్నారు.. ఇలా తనకు తానే గొప్పగా ఊహించుకున్నాడు. పోనీ ఈ వారం గేమ్‌ పర్ఫామెన్స్‌ ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. చీఫ్‌గా అట్టర్‌ ఫ్లాప్‌! చేతకానివాడిలా ఆడకపోవడమే కాక టీమ్‌ అంతా కూడా గేమ్‌ను వదిలేయమన్నాడు. అటు బిగ్‌బాస్‌నూ బూతులు తిట్టాడు. ఇది చూసి బిగ్‌బాస్‌ అడిని చీఫ్‌ పదవి నుంచి తొలగించాడు. 

గుణపాఠంగా..
అటు జనాలు సైతం.. అభయ్‌ హౌస్‌లో ఉంటే మిగతావారిని కూడా చెడగొట్టేలా ఉన్నాడని భావించి తనను పంపించేయడమే నయమనుకున్నారు. అందుకనే పెద్దగా ఓట్లు పడలేదు. చివరికి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేతులు కాల్చుకున్నాడు. తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. ఈ వారం ఎలిమినేట్‌ అయి హౌస్‌ అందరికీ ఓ గుణపాఠంగా మారాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)