Breaking News

Bigg Boss 8: అట్లుంటది ‘బిగ్‌ బాస్‌’తో

Published on Sun, 11/03/2024 - 10:49

మామూలుగా ఒక్క టికెట్‌ మీద ఒక సినిమానే చూడగలం. అలాగే వేరే టికెట్‌ మీద వేరే సినిమా చూడగలం. కాని అదే ఒక్క టికెట్‌ మీద డజనుకు పైగా సినిమాలు దాదాపు వంద రోజులు చూడగలిగితే అదే బిగ్‌ బాస్‌ కార్యక్రమం. మనం చూసే సినిమా సినిమాకీ ప్రత్యేకత కోరుకుంటాం. ఓ చిన్న సన్నివేశం కానీ, అంతెందుకు కనీసం చిన్న ప్రదేశం కానీ... ఒక సినిమాలోది మరో సినిమాలో కనబడితే నానా యాగీ చేస్తాం. కానీ బిగ్‌ బాస్‌ కార్యక్రమం మాత్రం ఇందుకు మినహాయింపు. గడచిన 8 సిరీస్‌లలో బిగ్‌ బాస్‌ కార్యక్రమ అంశం కానీ, కంటెస్టెంట్లు ఆడిన టాస్కులు కానీ అంతెందుకు వాళ్లున్న సెట్‌ అంతా ఒకటే. కాకపోతే సెట్‌కు కాస్త రంగులు మారుస్తారు. సిరీస్‌కు కంటెస్టెంట్లు మారతారు. అయినా ప్రతి సిరీస్‌కు బిగ్‌ బాస్‌కున్న ఆదరణ పెరుగుతుందే కానీ తరగట్లేదు.

 బిగ్‌ బాస్‌ కార్యక్రమానికి ప్రేక్షక అభిమానం ఆకాశమంత ఎత్తయితే, విమర్శకుల దురభిమానం అంతరిక్షమంత ఎత్తు అని చెప్పవచ్చు. ఈ వారం మెగా ఛీఫ్‌ ఎంపిక (విష్ణుప్రియ) ఓ విడ్డూరమయితే వారం మధ్యలో తన నటనతో గంగవ్వ చేసిన హారర్‌ ఎపిసోడ్‌ ఓ అద్భుతమనే అనాలి. యధావిధిగా కంటెస్టెంట్లు మూడు లవ్‌ ఎపిసోడ్లు నాలుగు ఫ్లర్టింగ్‌ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వారాంతంలో దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌గా ప్రసారమయిన ఫార్మెట్‌ కూడా పేలవంగా అనిపించింది. కాకపోతే కొత్త సినిమాల సెలబ్రిటీస్‌తో కాస్త కళకళలాడించడానికి ప్రయత్నించాడు బిగ్‌ బాస్‌. వారమంతా కాస్త టాస్కులలో తన సత్తా చాటుతూ స్క్రీన్‌ స్పేస్‌ మిగతావారి కన్నా ఎక్కువ షేర్‌ చేసుకున్నా మెహబూబ్‌కు మొండి చేయి చూపించి ఎలిమినేట్‌ చేశాడు బిగ్‌ బాస్‌. 

ఈ వారం ఎపిసోడ్‌ ట్విస్ట్‌ ఏంటంటే అవినాష్‌ కూడా తాను అనారోగ్య కారణాలతో హౌస్‌ బయటకు వెళుతున్నట్టు ఎపిసోడ్‌ చివర ప్రోమోలో చూపించారు. పోయిన సారి మన విశ్లేషణలో చెప్పుకున్నట్టు హౌస్‌లోని కంటెస్టెంట్లు తమ ఉనికి, ఉపాధి కోసం తమ ఆరోగ్యాలను కూడా లెక్క చేయడంలేదు. ఇన్ని జరుగుతున్నా బిగ్‌ బాస్‌ మాత్రం తన షో లాభాలను లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడు. ఏదేమైనా అట్లుంటది బిగ్‌ బాస్‌తో. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)