Breaking News

Bigg Boss 8: పులిహోర పార్టిసిపెంట్స్‌ ఉప్పు సత్యాగ్రహం

Published on Sun, 10/20/2024 - 09:29

బిగ్‌ బాస్‌ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టున్నాడు. తన ప్రేక్షకులను తిమ్మెని బమ్మిని అయినా చేసి ఆకట్టుకునే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా హౌస్‌లోకి కొంతమందిని కొత్తవారిని తీసేసి పాతవారిని తీసుకువచ్చి కలగాపులగం చేశాడు. ఇంకా చెప్పాలంటే... ఓ పులిహోర లాంటి పార్టిసిపెంట్స్‌ ఇప్పుడు హౌస్‌లో ఉన్నారు. కొత్తవాళ్లు ఎంతలా ఆడినా, నామినేషన్స్‌ ప్రక్రియ నుండి టాస్క్‌లు కాని, ఎలిమినేషన్‌ కాని అంతా రాయల్‌ క్లాన్స్‌దే పైచేయిగా ఉంది. గమనిక... ఇక్కడ పాతవాళ్లుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్రూప్‌కు రాయల్‌ క్లాన్స్‌ అనే పేరు పెట్టాడు బిగ్‌ బాస్‌. హౌస్‌లో కన్నడ పార్టిసిపెంట్స్, తెలుగు పార్టిసిపెంట్స్‌ మధ్య పోటీ అనిపిస్తుంది కాని హౌస్‌ మొత్తం ఒకే పార్టిసిపెంట్స్‌ అని అనిపించట్లేదు. బిగ్‌ బాస్‌ ఫాలో అవుతున్న సదరు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది గేమ్‌ అంతా ఏకపక్షమైందని. 

ఇక ఈ వారం టాస్క్‌ల పరంగా ఉప్పు గురించి ఓ టాస్క్‌ పెట్టాడు బిగ్‌ బాస్‌. కాకపోతే అది చాలా సిల్లీగా అనిపించింది. దసరా పండగ స్పెషల్‌గా వారాంతం ఎపిసోడ్‌ కొన్ని మెరుపులతో కొన్ని పాత ఆటలతో మమ అనిపించాడు బిగ్‌ బాస్‌. బిగ్‌ బాస్‌ అన్ని సిరీస్‌లు ఫాలో అవుతున్నవారికి తెలుస్తుంది... బిగ్‌ బాస్‌ టాస్కులన్నీ పాత టాస్కులే అని. ఇక్కడ టాస్కులు పాతవైతే ఫర్వాలేదు ఆ పాత టాస్కులు ఆడేవారు కూడా పాతవారే. ఓ సారి ఆట ఆడినవారు మరోసారి జాగ్రత్తగా ఆడతారు కదా. 

అప్పుడు కొత్తవాళ్ళెప్పుడూ పాతవాళ్ల  మీద గెలుస్తారు కదా. ఇంత చిన్న లాజిక్‌ బిగ్‌ బాస్‌ ఎందుకు గమనించలేదో ఏమో. కాని ఒక్క విషయంలో మాత్రం బిగ్‌ బాస్‌ను మెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్‌ పరదేశానిదైనా మన దేశంలో చేస్తున్నప్పుడు మన సంస్కృతికి పెద్ద పీట వేసి మన పండగ శోభలను కార్యక్రమంలో పొందుపరచడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా వారాంతంలో ప్రసారమయిన ఎపిసోడ్‌లో ప్రముఖ గాయని మంగ్లీ హౌస్‌లోని పార్టిసిపెంట్స్‌ చేత బతుకమ్మ ఆడించడం ఆకర్షణగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌లో ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడి ప్రేక్షకుల కోసం ఇంకెంత పులిహోర కలుపుతాడో చూడాలి మరి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)