Breaking News

Bigg Boss 8: బిగ్ బాస్ ఈ వారం విశ్లేషణ... 'బోల్డ్ వీక్'

Published on Mon, 11/25/2024 - 11:44

తెగించిన వాడికి తెడ్డే అన్నట్టు బిగ్‌బాస్ ఆఖరి దశకు చేరుకునే సమయంలో బాగా బోల్డ్ కంటెంట్‌తో ముందుకు వెళుతోంది. ఈ వారమంతా నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్ వరకు ఈ బోల్డ్ కంటెంట్‌తోనే ఈ వారమంతా నడిచిందని చెప్పొచ్చు. ముందుగా ఈ వారం చివరి చీఫ్ కంటెండర్ జరిగిన పోటీలో పార్టిసిపెంట్స్ పదజాలం బాగా బోల్డ్. మెగా చీఫ్‌గా గెలిచిన రోహిణి, దానికోసం పోటీ పడ్డ విష్ణుప్రియ మధ్య సంభాషణంతా సాలిడ్ బోల్డ్.

విష్ణు ఓపెన్‌గా రోహిణి క్యారెక్టర్‌పై నిందవేస్తే.. రోహిణి ఏకంగా నువ్వు ఒకరిని ఇష్టపడి వారు దొరకక ఇంకొకరి కోసం ప్రయత్నించావని విష్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ రకంగా ఇటువంటివి బుల్లితెరలో అదీ తెలుగు ఎంటర్టైన్మెంట్ మీడియాలో చాలా కొత్త అని చెప్పొచ్చు.  ప్రేక్షకుల పరంగా పరమ చెత్త అనొచ్చు. నాలుగు గోడల మధ్య ఆవేశపడితే ఇంటి గుట్టవుతుంది, అదే లక్షలాది ప్రేక్షకుల మధ్య అసభ్యంగా మాట్లాడితే అదే గుట్టు రట్టవుతుంది. ఈ విషయం కంటెస్టెంట్స్‌కు తెలిసినా తెలియకపోయినా బిగ్‌బాస్‌కు మాత్రం తెలుసు. ఎందుకంటే అదే బిగ్‌బాస్‌కు లాభదాయకం కాబట్టి.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?)

వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఇతర కంటెస్టెంట్లపై కంప్లైంట్లను ఓ చక్కటి ఆట రూపేణా చూపడం కొంతవరకు బావుంది. ఈ వారం యశ్మి ఎలిమినేట్ అవడం అటు కంటెస్టెంట్లకు ఇటు యష్మికి ఏ మాత్రం బాధ కలిగించలేదన్నది వాస్తవం. యష్మి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ రూపేణా గౌతమ్‌ను నేరుగా నామినేట్ చేసింది. ఈ వారం ఓ విషయమైతే చెప్పుకోవాలి, హౌసులో గ్రూపిజం సరిగ్గా ఉందో లేదో కాని బయట సోషల్ మీడియాలో మాత్రం బిగ్‌బాస్‌పై కుల, ప్రాంత, మతతత్వాలతో కొట్టుకు చస్తున్నారు కొందరు అమాయక నెటిజన్లు.

ఏ సంబంధం లేని వారి కోసం తమ విలువైన టైమ్ వెచ్చించి అర్ధం లేని కార్యక్రమం కోసం తమ జీవితాలను వ్యర్ధం చేసుకుంటున్న సోషలోళ్లు మీకు హాట్సాఫ్. దీనికంతటికీ కారణజన్ముడు ఆ బిగ్‌బాస్ మహానుభావుడని వేరే చెప్పాలా!

-ఇంటూరు హరికృష్ణ

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)