Breaking News

డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అతడి ఎలిమినేషన్ పక్కా?

Published on Fri, 11/22/2024 - 11:31

తెలుగు బిగ్‌బాస్ షోలో 12వ వారం చివరకొచ్చేసింది. లెక్క ప్రకారం గతవారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక అయిపోతుంది అనుకునేలోపు నబీల్.. తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడంతో బతికిపోయారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన.. ఈ వారం నామినేషన్స్ పూర్తిచేశారు. అలా అందరూ కన్నడ బ్యాచ్‌ని టార్గెట్ చేసి వాళ్లందరూ నామినేషన్స్‌‌లో ఉండేలా చేశారు. మరి ఈసారి వీళ్లలో ఎవరు బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది?

12వ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్లతో పాటు నబీల్ కూడా ఉన్నాడు. వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ.. ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. దాదాపు 26 శాతం ఓట్లతో ఈమె లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడట. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

వీళ్ల తర్వాత అంటే మూడో స్థానంలో యష్మి, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు సమాచారం. చిట్టచివరగా పృథ్వీ ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్, పృథ్వీ మధ్య ఓటింగ్ పరంగా 3 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. అంటే పృథ్వీతో పాటు నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లేగా!

ఈ సీజన్‌లో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీ. కానీ నామినేట్ అయిన ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబీల్ బయటకెళ్లిపోతాడు. మరి ఈవారం ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌‌పై బన్నీ)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)