Breaking News

Bigg Boss 8: ఫ్యామిలీని కూడా వదలని బిగ్‌బాస్‌.. వారమంతా ఏడిపించి, చివర్లో అలా..

Published on Mon, 11/18/2024 - 12:29

అప్పట్లో ఓ సినిమాలో ఓ విలన్ అంటాడు, నాకు నా శత్రువే కాదు, శత్రువు కుటుంబ సభ్యులు కూడా అవసరం. అలానే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కూడా తన షోలో వినియోగించుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లోని పార్టిసిపెంట్స్ కుటుంబసభ్యులను మాంచి డ్రామా రూపంలో దశలవారిగా పార్టిసిపెంట్స్ కు కలిపించి వారి మధ్య జరిగిన భావావేశాలను ప్రేక్షకులకు యధావిధిగా వండి వార్చాడు సదరు బిగ్ బాస్. 

కుటుంబ సభ్యులను పార్టిసిపెంట్స్ కలవడం లో పెద్ద వింతేమీ లేదు కాని, ఆ పార్టిసిపెంట్స్ తో హౌస్ లో జరుగుతున్న విషయాలను బాహటంగానే కుటుంబ సభ్యులు చర్చించడం అటు పార్టిసిపెంట్స్ కు ఇటు ప్రేక్షకులకు చిన్న పాటి ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా యశ్మి, ప్రేరణ, నిఖిల్, విష్ణు తదితరల పార్టిసిపెంట్స్ తమ కుటుంబ సభ్యులను కలవడంలో పడ్డ ఆనందం కన్నా ఆ తరువాత వాళ్ళతో మాట్లాడినపుడు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా  హౌస్ లో జరిగే ప్రేమాయణాల నుండి గిల్లికజ్జాల వరకు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.

అంతేనా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇంత చిన్న మసాలా అయితే ఎలా సరిపోతుంది అనుకున్న బిగ్ బాస్ ఒక పార్టిసిపెంట్ ను వారమంతా ఏడిపించి వారం చివర్లో వాళ్ళ ఫ్యామిలీని కలిపించి ప్రేక్షకులకు ఓ మాంచి మసాలానే చూపించాడు బిగ్ బాస్. ఆ పార్టిసిపెంటే టేస్టీ తేజ. ఓ రకంగా చెప్పాలంటే ఈ వారమంతా బిగ్ బాస్ ఎపిసోడ్లలో ఈ తేజ ఏడుపునే అమ్ముకున్నాడు బిగ్ బాస్. అంతేనా అదే తేజను ఎలిమినేషన్లో పెట్టి నాటకీయంగా నో ఎలిమినేషన్ అని చెప్పింది ఈ వారానికి తేజకు కథ సుఖాంతం చేశాడు. 

ఒక్క విషయం మాత్రం అటు ప్రేక్షకులు ఇటు పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూడడం లేదా పార్టిసిపెంట్ చేయడమంటే కాస్త గుండె దిటవుతో ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ తన కార్యక్రమాన్ని నార్మల్ ప్యాక్ లో చేయడు ఫ్యామిలీ ప్యాక్ తప్ప.
-ఇంటూరు హరికృష్ణ
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)