Breaking News

సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్‌.. కానీ పుష్ప లెవల్‌లో రైతుబిడ్డ ఎంట్రీ

Published on Sun, 12/22/2024 - 19:23

సోనియా ఆకుల.. బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో సెన్సేషన్‌ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్‌ 8లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ అయిన పృథ్వీ, నిఖిల్‌తో కలిసి ఒక ‍గ్యాంగ్‌గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్‌ చేస్తే షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్‌ చేసేయాలనుకుంది.

నిఖిల్‌కు ఆహ్వానం.. కానీ!
అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్‌ నిఖిల్‌నే నామినేట్‌ చేసింది. సోషల్‌ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్‌ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్‌ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ మాత్రం సోనియా రిసెప్షన్‌కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. 

పుష్ప లెవల్‌లో ఎంట్రీ
ఈమేరకు తన గ్రాండ్‌ ఎంట్రీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో ప్రశాంత్‌ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్‌బాస్‌ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్‌ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: ఓవరాక్షన్‌ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్‌ సీపీ సీరియస్‌ వార్నింగ్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)