Breaking News

Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్

Published on Mon, 09/30/2024 - 11:36

బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్‌బాస్ బజ్‌లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన సోనియా.. కొన్నింటికి మాత్రం ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)

హౌసులో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది అని అడగ్గా.. అభయ్, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది. నిఖిల్‌కి నీపై ఎలాంటి ఫీలింగ్ ఉందని అడగ్గా.. మా అన్నలాగా, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని సోనియా చెప్పింది. లోపల హౌసులో వాళ్లని ఏమారుస్తావేమో గానీ నన్ను వద్దులే అని అర్జున్ సైలెంట్‌గా సెటైర్ వేశాడు.

పృథ్వీకి కోపమే మైనస్ అని తెలిసినా.. వాడిని మీరు ఓ ఆయుధంలా ఉపయోగించుకున్నారని మేం అంటున్నాం అని.. అలానే ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకుంటున్నారు గానీ వెనకుండి ఆట నడిపిస్తున్నారని ఆడియెన్స్‌కి తెలుసులే అని సోనియా బాగోతాలన్ని అర్జున్ బయటపెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి నాకేం తెలియదన్నట్లు కూర్చుంటారు 'కపటనాటక సూత్రధారి' అని సోనియాకి కొత్త పేరు పెట్టాడు.

(ఇదీ చదవండి: మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?)

ఆడపులి అని సోనియా తనకు తానే అనుకోవడంపైన కూడా అర్జున్ కౌంటర్ వేశాడు. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడతుంది, పిల్లిలా వెనకుండదని అన్నాడు. ఇక నిఖిల్-పృథ్వీ గురించి అర్జున్ మాట్లాడుతూ.. వాళ్లు బాధితులు, మీరు బాధపెట్టినోళ్లు కాబట్టి ముందు మీరు బయటకొచ్చేశారు అని అన్నాడు. దీంతో కోపమొచ్చినా సరే సోనియా ఆపుకొంది. చూద్దాం వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో? వాళ్లేం ఆట ఆడతారో చూద్దాం అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

ఇలా హౌసులో శివంగిలా చెలరేగిపోయింది గానీ ఇంటర్వ్యూలో మాత్రం పిల్లిలా అర్జున్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక సౌండ్ చేయలేకపోయింది. మిగతా వాటి సంగతేమో గానీ నిఖిల్‌, తనకు అన్నయ్య లాంటోడు అని సోనియా చెప్పడం మాత్రం విడ్డూరంగా అనిపించింది. 

(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)